న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ‘వికసిత్ భారత్’ పేరుతో బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపెయిన్ వెంటనే నిలిపివేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పౌరుల వాట్సాప్‌కు వికసిత్ భారత్ మెసెజ్‌లు పంపడం తక్షణమే పేయాలని కేంద్ర ఐటీ శాఖకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇకనుంచి ఎలాంటి మెసేజ్ డెలివరీ చేయొద్దని ఆదేశించింది.
అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల సందేశాలు పౌరుల ఫోన్‌లకు వస్తుండటంతో అనేక ఫిర్యాదులు అందినట్లు ఈసీ పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈసీ ఆదేశాలపై స్పందించిన ఐటీ శాఖ.. ఎన్నికల కోడ్‌కు ముందుగానే మెసెజ్‌లు పంపినప్పటికీ వాటిలో కొన్ని నెట్‌వర్క్ కారణంగా ఆలస్యంగా డెలివరీ అవుతున్నట్లు తెలిపింది.
కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో మార్చి 17 నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇక ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడుతల్లో పార్లమెంట్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
చదవండి: డబ్బుల్లేవ్.. ప్రచారం చేసుకోలేకపోతున్నాం: కాంగ్రెస్ ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment