
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో తొలిసారి ఈ ఏడాదిలోనే ఐదుగురికి భారతరత్న ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఒకే సంవత్సరంలో ఎక్కువమందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించినట్లయింది. గతంలో 1999లో నలుగురికి భారతరత్న ప్రకటించడమే ఇప్పటివరకు రికార్డు.
ఈ ఏడాది భారతరత్న దక్కించుకున్నవారితో కలిపి భారతరత్నాల జాబితాలో ఇప్పటివరకు చోటు దక్కించుకున్న వారి సంఖ్య మొత్తం 53కు చేరింది.కేంద్ర ప్రభుత్వం 1954లో అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న, పద్మవిభూషణ్‌లను ఏర్పాటుచేసింది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి అత్యున్నత స్థాయి పనితీరు కనబరిచిన వారికి భారతరత్న ఇస్తారు.
ఈ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను ప్రధాని రాష్ట్రపతికి అందజేస్తారు. ప్రధాని చేసే సిఫారసు తప్ప ఎలాంటి కేంద్ర ప్రభుత్వం ఇతర అధికారిక సిఫారసులేవి రాష్ట్రపతికి వెళ్లవు. అవార్డు కింద రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం, భారతరత్న పతకం అందిస్తారు. ఎలాంటి నగదు ఇవ్వరు.
ఇదీ చదవండి.. 8 మంది ఎంపీలతో ప్రధాని లంచ్.. స్వయంగా బిల్లు చెల్లింపు
Comments
Please login to add a commentAdd a comment