బ్రిస్‌బేన్ : క్వారంటైన్‌లో ఉండటం ఇష్టం లేని ఓ వ్యక్తి మాస్టర్ ప్లాన్ వేశాడు. బెడ్ షీట్లను తాడుగా చేసి, నాల్గవ అంతస్తు మీదనుంచి కిందకు దిగి జంప్ అయ్యాడు. వివరాలు.. ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌కు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి గత సోమవారం పశ్చిమ ఆస్ట్రేలియాకు వచ్చాడు. అయితే, కరోనా నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలలో కఠిన ఆంక్షలు ఉన్నాయి. సదరు వ్యక్తి 48 గంటల్లోగా పశ్చిమ ఆస్ట్రేలియాను వదిలి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. అతడ్ని హుటాహుటిన క్వారంటైన్ హోటల్‌కు పంపారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా అతడికి నెగిటివ్ వచ్చింది.
అయినప్పటికి క్వారంటైన్‌లోనే ఉంచారు. క్వారంటైన్‌లో ఉండటం ఇష్టం లేని ఆ వ్యక్తి బయటకు వెళ్లటానికి ఓ ప్లాన్ వేసుకున్నాడు. బెడ్ షీట్ సహాయంతో ఓ తాడు తయారు చేసుకున్నాడు. తనుంటున్న నాల్గవ అంతస్తు మీదనుంచి కిందకు దిగి పారిపోయాడు. కానీ, మంగళవారం ఉదయం పోలీసులు అతడ్ని వెతికి పట్టుకున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చాడని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment