యూకేకు ఆంక్షలతో బదులిచ్చిన భారత్‌ | India to impose 10-day mandatory quarantine, COVID-19 tests on all UK travellers | Sakshi
Sakshi News home page

యూకేకు ఆంక్షలతో బదులిచ్చిన భారత్‌

Published Sat, Oct 2 2021 5:20 AM | Last Updated on Sat, Oct 2 2021 5:20 AM

India to impose 10-day mandatory quarantine, COVID-19 tests on all UK travellers  - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌కు వచ్చే బ్రిటిష్‌ ప్రయాణికులు టీకా తీసుకున్నా, తీసుకోకున్నా 10 రోజులు తప్పక క్వారంటైన్‌లో గడపాలని భారత్‌ నిర్ణయించింది. బ్రిటన్‌కు వచ్చే భారతీయులు టీకా తీసుకున్నా సరే క్వారంటైన్‌లో గడపాలన్న నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డ భారత్‌ అందుకు ప్రతిచర్యగా ఈనిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌ విధించిన గడువు అక్టోబర్‌ 4నుంచే భారత్‌ ఆదేశాలు కూడా అమల్లోకి రానున్నాయి. దీంతో బ్రిటన్‌ అనాలోచిత చర్యలకు భారత్‌ బదులిచ్చినట్లయింది. నిజానికి గడువులోపు ఈ విషయంలో బ్రిటన్‌ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని భారత్‌ ఆశించింది.

కానీ యూకే నుంచి తగిన స్పందన రాకపోవడంతో ప్రతిచర్య నిర్ణయం తీసుకుంది. భారత నిర్ణయంపై యూకే స్పందించాల్సి ఉంది. ఇండియాకు వచ్చే బ్రిటన్‌ దేశీయులు 72 గంటలకు ముందే కరోనా ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు చేయించుకోవాలని తాజా ఆదేశాల్లో భారత్‌ స్పష్టం చేసింది. భారత్‌కు వచి్చన తర్వాత వారికి మరోమారు ఈ టెస్టు చేస్తారు. ఫలితం ఎలాఉన్నా, టీకా తీసుకున్నా, తీసుకోకున్నా 8రోజుల అనంతరం మళ్లీ టెస్టు చేస్తారు. ఈలోపు వారు తప్పనిసరి క్వారంటైన్‌ గడపాల్సిఉంటుంది.  అక్టోబర్‌ 4నుంచి బ్రిటన్‌ కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం ఇండియన్స్‌ కరోనా టీకా తీసుకున్న సర్టిఫికెట్‌ చూపినా యూకే రాగానే హోం క్వారంటైన్‌లో పదిరోజులుండాలి.  

యత్నిస్తున్నాం: ప్రయాణ నిబంధనలపై ఇండో– యూకే మధ్య చర్చలు ఎలాంటి ఫలితాలనివ్వలేదు.  కోవిïÙల్డ్‌ టీకాతో సమస్య లేదని, సర్టిఫికెట్‌తోనే సమస్యని బ్రిటన్‌ అధికారులు అర్థంలేని వాదన వినిపించారు. దీంతో భారత్‌ తగిన ప్రతిస్పందనకు సిద్ధమైంది. భారత ప్రతిచర్యపై భారత్‌లో బ్రిటిష్‌ హైకమిషన్‌ ప్రతినిధి స్పందించారు. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, తమ ప్రయాణ పాలసీ పరిధిలోకి మరిన్నిదేశాలను తెచ్చే యత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. యూకేకు చాలామంది భారతీయులు వస్తున్నారని, ఇప్పటివరకు 62,500 స్టూడెంట్‌ వీసాలను జారీ చేశామని, గతేడాదితో పోలిస్తే ఇవి 30 శాతం అధికమని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement