
బెంగళూరు : కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఐదుగురు భారత హాకీ జట్టు ఆటగాళ్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రికి తరలించారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి సాధారణం కంటే తక్కువకు పడిపోవడంతో మంగళవారం భారత పురుషుల హాకీ జట్టు కీలక ఆటగాడు మన్‌దీప్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఎస్‌ఎస్ స్పర్శ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో మన్‌దీప్ చికిత్స పొందుతుండగా... ఇదే ఆసుపత్రిలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, డిఫెండర్లు సురేందర్ కుమార్, జస్‌కరణ్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, గోల్‌కీపర్ కృషన్ బహదూర్ పాఠక్‌లను చేర్చారు. ఈనెల 20 నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో జాతీయ హాకీ శిక్షణ శిబిరం మొదలవుతుంది. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌గా వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment