
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్వారంటైన్‌లో భాగంగా ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు రాపిడ్ టెస్ట్‌లో ముఖ్యమంత్రికి కోవిడ్ నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్న కేసీఆర్‌కు బుధవారం ఎంవీ రావు అధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లు చేశారు. ఈ క్రమంలో రాపిడ్ టెస్ట్‌లో కోవిడ్ నెగిటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు వైద్యం బృందం వెల్లడించింది. ఆర్‌టీపీసీఆర్ పరీక్షా ఫలితాలు గురువారం రానున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment