తల్లిదండ్రులతో తమన్నా
హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్‌కు నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం అమ్మానాన్న చికిత్స తీసుకుంటున్నారు. దేవుడి దయ, మీ అందరి ప్రార్థనలతో వాళ్లు తొందరగా కోలుకుంటారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మీ తల్లిదండ్రులు త్వరగా కోలుకుంటారు’’ అని పలువురు సెలబ్రిటీలు, అభిమానులు తమన్నాకు ధైర్యం చెబుతూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment