
ముంబై: స్వదేశంలో రెండు వారాల హార్డ్ క్వారంటైన్ తర్వాత ఇంగ్లండ్‌లో అడుగు పెట్టే భారత క్రికెట్ జట్టు అక్కడ కూడా కొన్ని రోజులు అదే తరహా వాతావరణంలో ఉండాల్సి రావచ్చు. టీమిండియా రాకకు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ విషయంలో ఇంగ్లండ్ ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో అడుగు పెట్టగానే నేరుగా హాంప్‌షైర్ మైదానం పక్కన ఉన్న హోటల్‌కు వెళ్లిపోతారు.
వారికి అక్కడే కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. ఆ తర్వాత కొన్ని ఆంక్షలు, నిబంధనలతో కూడిన ఐసోలేషన్ మొదలవుతుంది. ఐసోలేషన్ సమయంలోనూ పరీక్షలు కొనసాగుతాయి’ అని ఐసీసీ పేర్కొంది. దీనిని బట్టి చూస్తే టీమిం డియా హార్డ్ క్వారంటైన్‌లో గడపడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎన్ని రోజులు అనే విష యంపై మాత్రం ఐసీసీ స్పష్టతనివ్వలేదు. న్యూజి లాండ్ జట్టు విషయంలో మాత్రం దీనిని మూడు రోజులకే పరిమితం చేశారు. పురుషులతోపాటు ఇంగ్లండ్‌కు ప్రయాణించే భారత మహిళల జట్టు విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.