న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజువారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టులో నలుగురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. అదే విధంగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి చెందిన 150 మంది ఉద్యోగులకు పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ న్యాయమూర్తులంతా గత మంగళవారం.. జస్టిస్ సుభాషన్ రెడ్డి రిటైర్మెంట్ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ తర్వాత ఆయనకు పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మరో నలుగురు న్యాయమూర్తులతో కలిసి గత గురువారం కోవిడ్ వ్యాప్తిపై సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి మొత్తం 32 జడ్జిలున్నారు. వీరిలో నలుగురికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. సుప్రీం కోర్టుకు చెందిన 150 మంది ఉద్యోగులు క్వారంటైన్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సుప్రీంలో వారానికి మూడు రోజులు మాత్రమే వర్చువల్ మోడ్‌లో కేసుల విచారణ జరుగుతుంది.
పార్లమెంట్‌లో నిర్వహించిన ర్యాండమ్ టెస్టుల్లో కూడా 400 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తెలింది. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో సెక్రటేరియట్ స్టాఫ్‌తోపాటు సెక్యురిటీ సిబ్బంది ఉన్నారు. దేశంలో ప్రస్తుతం గడిచిన 24 గంటల్లో లక్షా 59 వేల 632 కేసులు నమోదు కాగా..327 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 5 లక్షల 90 వేల 611 యాక్టివ్ కేసులున్నాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి పెరిగింది. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3623కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment