సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్వారంటైన్‌లోకి వెళ్లారు. తన భర్త అనిల్ కోవిడ్–19 బారిన పడటంతో తమ కుటుంబం కూడా క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు బుధవారం కవిత ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు కవిత చెప్పారు.
My husband Anil garu has tested positive for #COVID19. He is under home quarentine and is doing well. My family and I have quarantined ourselves and would not be making any public or personal appearances. My office will reschedule all the meetings to avoid inconvenience.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 24, 2021
దేశంలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతుంది. రోజురోజుకు కేసుల్లో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. తాజాగా 24 గంటల్లో కొత్తగా 53,476 కరోనా కేసులు, 251 మరణాలు సంభవించాయి. తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలను మూసి వేసిన సంగతి తెలిసిందే.
చదవండి: తెలంగాణలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment