సాక్షి, తిరుపతి: స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు నిలువు దోపిడీ చేసి మానవత్వానికి మచ్చ తెచ్చారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ) రిటైడ్ అధికారికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన పద్మావతి కోవిడ్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో నిన్న (మంగళవారం) ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడు. అయితే మృతుడి ఒంటిపై ఉన్న బంగారం, పర్సులో నగదు, ఖరీదైన సెల్‌ఫోన్‌ను దొంగలించారు. దీనిపై కుటుంబ సభ్యులు బుధవారం స్విమ్స్ వద్ద ఆందోళనకు దిగారు. స్పందించిన స్విమ్స్ అధికారులు మృతుడి కుటుంబీకులకు కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే అందచేశారు. నగదు, మొబైల్ మాత్రం ఇవ్వలేదు. ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో కోవిడ్ బాదితులకు వైద్యం అందిస్తుంటే కొంతమంది ఇలా దారుణానికి పాల్పడటం బాద కలిగిస్తోందంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు కరోనా..)
Comments
Please login to add a commentAdd a comment