
న్యూజిలాండ్ మహిళలతో తొలి వన్డేకు మందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన క్వారంటైన్ నిభంధనల కారణంగా శనివారం జరిగి తొలి వన్డేకు మంధాన దూరం కానుంది. ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న మంధాన.. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌కు దూరమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి చెందింది.మంధానతో పాటు పేసర్లు మేఘనా సింగ్,రేణుకా సింగ్ కూడా తొలి వన్డేకు దూరం కానున్నారు.
కాగా మంధాన స్ధానంలో యస్తిక భాటియాను ఎంపిక చేశారు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో షఫాలీ వర్మతో కలిసి భాటియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే ఆ మ్యాచ్‌లో 26 పరుగులు చేసి యస్తిక భాటియా పర్వాలేదు అనిపించింది.ఇక న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు 5 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే శనివారం జరగనుంది. మొత్తం ఐదు వన్డేలు క్వీన్స్‌టౌన్ వేదికగానే జరగనున్నాయి.
చదవండి: Aus Vs Nz Cancelled: న్యూజిలాండ్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ రద్దు.. కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment