
‘‘కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే నేను బాగానే ఉన్నాను. గృహనిర్భందంలో ఉంటున్నాను’’ అన్నారు కృతీ సనన్. ఇటీవల ఓ హిందీ చిత్రం షూటింగ్ ముగించుకుని చండీగఢ్ నుంచి ముంబై చేరుకున్నాక కృతీ సనన్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ అనే వార్త వచ్చినప్పటికీ మొదట ఆమె స్పందించలేదు. అయితే, కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని బుధవారం సోషల్ మీడియా ద్వారా ఆమె స్పష్టం చేశారు. ‘‘ఈ కష్టాన్ని దాటేస్తాను. బాగా విశ్రాంతి తీసుకుని, త్వరలో మళ్లీ నా పనులు మొదలుపెడతాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ మహమ్మారి (కరోనా) ఇంకా మనతోనే ఉంది’’ అన్నారు కృతీ సనన్.
Comments
Please login to add a commentAdd a comment