పీపీఈ కిట్లు ధరించి పారిపోయి వచ్చిన వృద్ధురాలిని రిక్షా ఎక్కిస్తున్న దృశ్యం
తాడేపల్లిరూరల్: పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కాలనీలో నివసించే భార్యాభర్తలు క్వారంటైన్ సెంటర్ నుంచి పరారై వచ్చారు. కాలనీలోకి వచ్చిన భార్యాభర్తలిద్దరూ రోడ్డు మీద సంచరించడంతో స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలోనూ వీరు ఇదే విధంగా పారిపోయి వచ్చారని గుర్తించి వారిని ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేశారు.
రెండురోజుల క్రితం గుండిమెడ క్వారంటైన్ నుంచి పారిపోయి రాగా తాడేపల్లి మున్సిపల్ అధికారులు, వైద్యులు డాక్టర్ కిరణ్‌కుమార్ భార్యాభర్తలిద్దరినీ గుంటూరులోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. తిరిగి మరలా వారు పారిపోయి రావడంతో ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంచి, ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకొని తిరిగి మరలా క్వారంటైన్‌కు తరలిస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment