ఐసోలేషన్ కేంద్రంలో వేయడానికి పడకలు మోస్తున్న సర్పంచ్ రాజు
ఆత్మకూరు: గ్రామం బాగుండాలి.. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు కోవిడ్ బాధితుల కోసం సొంతంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. గ్రామంలో యాక్టివ్ కేసులను తగ్గించడానికి ఇదే సరైన మార్గమని భావించిన ఆయన.. స్థానిక సెయింట్ థెరిస్సా స్కూల్‌లో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశాడు. ఆదివారం రాత్రి నుంచి ఈ కేంద్రంలో పూర్తి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఉండే వారికి ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం చికెన్‌తో, రాత్రికి శాఖాహారంతో భోజనం అందించనున్నారు. కాగా, కోవిడ్ వచ్చినవారి ఇళ్లలో ఐసోలేషన్ సదుపాయం లేక ఇబ్బందిపడుతున్నారని సర్పంచ్ రాజు తెలిపారు.
చదవండి: కరోనా బాధితుల కోసం ఉచిత అంబులెన్సులు
Comments
Please login to add a commentAdd a comment