క్వారంటైన్లు ఖాళీ! | Corona Isolation Centers Are Gradually Emptying | Sakshi
Sakshi News home page

క్వారంటైన్లు ఖాళీ!

Published Sun, Apr 12 2020 3:28 PM | Last Updated on Sun, Apr 12 2020 3:28 PM

Corona Isolation Centers Are Gradually Emptying - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కరోనా ఐసోలేషన్‌ సెంటర్లు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. విదేశాల నుంచి వచి్చన వారితో పాటు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి గుర్తింపు, వారి క్వారంటైన్‌ సహా వైరస్‌ ఇంకుబేషన్‌ పీరియడ్‌ కూడా ముగియడంతో ఇప్పటి వరకు ఆయా సెంటర్లలో చేరి్పంచిన వారిని ఇంటికి పంపిస్తున్నారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రి సహా నేచర్‌క్యూర్, చారి్మనార్‌లోని నిజామియా ఆస్పత్రి కార్వంటైన్‌ సెంటర్లు ఖాళీ అయ్యాయి. రాజేంద్రనగర్‌లో ఐదు క్వారంటైన్‌  సెంటర్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 160 మంది ఉన్నారు. మేడ్చల్‌ జిల్లాలో 152 మంది, రంగారెడ్డి జిల్లాలో 135 మంది మాత్రమే ఉన్నారు. గాం«దీ, కింగ్‌కోఠి, ఫీవర్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో మరో 364 మంది కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే.. ఐసీయూకి  తరలించి చికిత్స అందిస్తున్నారు. నెగిటివ్‌ రిపోర్టు వచి్చన వారిని హోం కార్వంటైన్‌కు తరలించి, వారు ఇంటి నుంచి బయటికి రాకుండా చూస్తున్నారు.  

కుటుంబసభ్యుల మధ్య వారు.. 
మార్చి 22 వరకు వివిధ దేశాల నుంచి సుమారు 74 వేల మంది శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. వీరిలో 25,937 వేల మందికిపైగా ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచారు. వీరిలో 30 మందికి ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా కరోనా వైరస్‌ సోకగా, వీరి నుంచి మరో 20 మంది కుటుంబ సభ్యులకు వైరస్‌ విస్తరించింది. ఇప్పటికే వీరందరినీ గుర్తించి, చికిత్సలు కూడా అందించారు. కోలుకున్న వారిని ఇంటికి పంపించారు. ఇకపై వీరినుంచి వైరస్‌ సోకే ముప్పు లేదనే స్పష్టత ప్రభుత్వానికి వచి్చంది. 

పోలీసు నిఘాలో వీరు.. 
మార్చి 13 నుంచి 15 వరకు జరిగిన జమాత్‌కు తెలంగాణ నుంచి 1089 మంది వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో జీహెచ్‌ఎంసీ నుంచి 603 మంది ఉన్నట్లు గుర్తించింది. వీరితో పాటు వీరికి సన్నిహితంగా 3015 మంది ఉండగా, వారందరినీ క్వారంటైన్‌ సెంటర్లకు తరలిం చింది. వైరస్‌ కేవలం బాధితులు, వారి కుటుంబ సభ్యుల వరకే పరిమితమైందా? లేక కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ఏమైనా జరిగిందా? అనేది కూడా రెండు మూడు రోజుల్లో తేలనుంది.

ఏ ఐసోలేషన్‌లో ఎంత మంది?  
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి కరోనా నోడల్‌ సెంటర్‌లో శనివారం ఉదయం వరకు 295 పాజిటివ్‌ కేసులు ఉండగా, కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు మరో 250 మంది ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 29 పాజిటివ్‌ కేసులు ఉండగా, ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో మరో 10 మంది అనుమానితులు ఉన్నారు. కింగ్‌కోఠి జిల్లా ఆస్ప త్రిలో 12 పాజిటివ్‌ కేసులు ఉండగా, ఐసోలేషన్‌ వార్డులో మరో 74 మంది అనుమానితులు ఉన్నారు. ఇక ఫీవర్‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో 30 మంది అనుమానితులు ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement