సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో రైళ్లను ఐసోలేషన్, క్వారంటైన్ వార్డులుగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత లాలాగూడ వర్క్‌షాపులో ఓ రైలు బోగీలోని రెండు కేబిన్లను ఐసోలేషన్ గదులుగా మార్చారు. డిమాండ్ ఆధారంగా ఇలాంటి మరిన్ని కేబిన్లను రూపొందించనున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కేబిన్‌లో అప్పర్, మిడిల్, సైడ్ బెర్తులను తొలగించి 2 లోయర్ బెర్తులను మాత్రమే ఉంచా రు. ప్రత్యేకంగా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దోమ లు రాకుండా కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఉన్న టాయిలెట్‌ను తొలగించి బాత్‌రూమ్‌గా మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment