నల్లకుంట: దేశంలో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, మంకీ పాక్స్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కె. శంకర్ అన్నారు. ఇందు కోసం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 36 పడకలతో మంకీ పాక్స్ ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశామన్నారు. మంగళవారం మీడియాతో కలిసి ఫీవర్‌లో మంకీ పాక్స్ వార్డుని(7వ వార్డు) పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే వారిలో ఒకరికైనా మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తే నేరుగా విమానాశ్రయం నుంచి నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వస్తారన్నారు.
అనంతరం ఇక్కడి వైద్యుల సూచనల మేరకు అనుమానితుల నుంచి బ్లడ్, యూరిన్, క్కిన్ లీసెన్స్ (నీటి), గొంతు నుంచి శాంపిల్స్ తదితర ఐదు రకాల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపుతామన్నారు. రిజల్ట్స్‌లో ఏమైనా అనుమానాలు ఉంటే మరోసారి శాంపిళ్లు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం పుణేకు పంపిస్తామన్నారు. ఈ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రత్యేక చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. సాధారణంగా ఈ వ్యాధి గాలి ద్వారా సోకదని, ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గరికి పీపీఈ కిట్లు ధరించకుండా వెళ్లినప్పుడు ఆ రోగి దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుందన్నారు.
ఈ వైరస్ ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. మంకీ పాక్స్ కొత్తది కాదని, పలు దేశాల్లో ఇప్పటికే ఉందన్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి కాళ్లు, చేతులు, ముఖంపై, శరీరంపై దద్దుర్లు(గుళ్లలు) ఏర్పడడం, గొంతులో వాపు రావడం తదితర లక్షణాలు ఉంటాయన్నారు. సోమవారం డీఎంఈ కార్యాలయంలో గాంధీ ఆస్పత్రి çసూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, మైక్రో బయాలజిస్టు డాక్టర్‌లతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా(సెన్సటైజేషన్) వివరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంకీ పాక్స్ వచ్చిన రోగిని వేరే ఆసుపత్రికి ఎలా తరలించాలి, రోగికి చికిత్స, శాంపిల్స్ సేకరణ, రోగికి వైద్యం అందించే వైద్యులు ఇతర సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచి్చనట్లు ఆయన పేర్కొన్నారు.
(చదవండి: 111 రోజులు చికిత్స.. ప్రభుత్వాసుపత్రి ప్రాణం పోసింది.. మంత్రి హరీశ్‌రావు అభినందనలు)
Comments
Please login to add a commentAdd a comment