
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలను కరోనా ఐసోలేషన్ సెంటర్లకు అడిగితే ఇవ్వాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణ శాఖ అధికారులు లేదా జిల్లా యంత్రాంగం లేఖ/ ఈమెయిల్ ద్వారా అడిగితే ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్ లేదా ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అధికారి, సంబంధిత కేవీల ప్రిన్సిపాళ్లు తరగతి గదులను కరోనా కేసులను ఉంచేందుకు అనుమతించాలని వెల్లడించింది. ఆ వివరాలను తమకు ఈమెయిల్ (్జఛిp.జుఠిటఃజఝ్చజీ.ఛిౌఝ) ద్వారా తెలియజేయాలని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment