
న్యూఢిల్లీ: స్వల్ప లక్షణాలున్న కరోనా రోగులను చికిత్స అనంతరం పరీక్షించకుండానే డిశ్చార్జ్ చేస్తే.. వారు వైరస్‌ను వ్యాప్తి చేస్తారనేందుకు ఆధారాలేవీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ పేషెంట్లు డిశ్చార్జ్ అయిన తరువాత వారం పాటు కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని ‘డిశ్చార్జ్ విధానం’లో పేర్కొంది. తీవ్ర స్థాయిలో వైరస్ ఇన్‌ఫెక్టన్‌కు గురైనవారిని, ఇతర సీరియస్ వ్యాధులున్నవారిని ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చాకే డిశ్చార్జ్ చేయాలని స్పష్టం చేసింది. స్వల్పంగా ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారిని వారిలో మూడురోజుల్లో జ్వరం సహా ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేనట్లయితే డిశ్చార్జ్ చేయవచ్చని సూచించింది. స్వల్ప లక్షణాలున్న పేషెంట్లు ఇంట్లోనే వేరుగా ఉండే సౌకర్యం ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉండవచ్చని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment