జ్వరంతో విద్యార్థిని మృతి | Student Died With Fever In West Godavari | Sakshi
Sakshi News home page

జ్వరంతో విద్యార్థిని మృతి

Published Tue, Oct 30 2018 12:47 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Student Died With Fever In West Godavari - Sakshi

ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులో ప్రసన్న మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు మృతురాలు ప్రసన్న (ఫైల్‌)

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: జ్వరంతో బాధపడుతున్న ఒక విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దొరసానిపాడుకు చెందిన ఉనమట్ల రాంబాబు, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. అందులో రెండవ కుమార్తె ఉనమట్ల ప్రసన్న (16) జంగారెడ్డిగూడెంలోని వెంకటేశ్వర కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఆమెకు గత పదిరోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో ఈనెల 23న విజయవాడలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్సనందించిన వైద్యులు ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయాయంటూ ఆమెకు రక్తం కూడా ఎక్కించారు. అయినా ఫలితం దక్కలేదు. జ్వరం తీవ్రత ఎక్కువై సోమవారం ఉదయం విద్యార్థిని మృతిచెందింది. అందరితో కలసిమెలసి ఉండే ప్రసన్న మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement