సాయంత్రం ఓపీ..  | Key government decision with severity of fevers in the state | Sakshi
Sakshi News home page

సాయంత్రం ఓపీ.. 

Published Wed, Aug 28 2019 2:42 AM | Last Updated on Wed, Aug 28 2019 2:42 AM

Key government decision with severity of fevers in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అన్ని ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఔట్‌ పేషెంట్లను (ఓపీ) చూడాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదు అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జ్వరాలపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఓపీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు నిర్వహిస్తున్నారు.

బుధవారం నుంచి సాయంత్రం 4 నుంచి ఆరేడు గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతోపాటు అవసరమైన మందులు, ఆసుపత్రుల్లో మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 9 బోధనాసుపత్రులు ఉన్న విషయం తెలిసిందే. వీటిల్లో తక్షణమే సాయంత్రం వేళ ఓపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇదిలావుండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు అధికారులు అంచనా వేశారు.  

వైద్య బడ్జెట్‌ రూ. 5,500 కోట్లు! 
వచ్చే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌ రూ.5,500 కోట్లు ఉండే అవకాశముందని సమాచారం. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. గత ఆర్థిక బడ్జెట్‌ రూ.6,900 కోట్లు ఉండగా, ఖర్చు పెట్టిన దాన్ని ఆధారంగా వాస్తవ రూపంలో తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement