మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నియంత్రణ, క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యం, పరిస్థితులను పరిశీ లించి తగిన చర్యలు చేపట్టడం లక్ష్యంగా మరోసారి ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పట్టణం, గ్రామంలోని ప్రతి ఇంటికి ఆరోగ్య సిబ్బంది వెళ్లి జ్వర సర్వే చేయనున్నారు. దీనికి సంబంధించి మంత్రి హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయా కర్‌రావు గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం హరీశ్‌రావు మీడి యాతో మాట్లాడారు. శుక్రవారం నుంచి వైద్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వ యంతో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేస్తారని.. జ్వరం, కరోనా లక్షణాలున్న వారికి అక్కడికక్కడే హోం ఐసోలేషన్ కిట్లు ఇస్తారని తెలి పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేస్తామని.. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతామని వెల్లడిం చారు. కరోనా రెండో వేవ్ సమయంలో రాష్ట్రంలో చేపట్టిన ఇంటింటి సర్వే, హోం ఐసోలేషన్ కిట్లు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. నీతి ఆయోగ్, ఎకనామిక్ సర్వే రిపోర్టు కూడా ఇంటింటి సర్వేను ప్రశంసించాయని గుర్తు చేశారు.
అన్ని ఆస్పత్రుల్లో ఏర్పాట్లు
రాష్ట్రంలో రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశామని హరీశ్‌రావు తెలి పారు. కిట్లు లేవన్న భావన రాకుండా గ్రామ స్థాయిలో పంపిణీ చేశామని, వార్డు స్థాయిలోనూ ఉంటాయని చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో కార్య దర్శులు, ఇతర అధికారుల సాయంతో సర్వే నిర్వ హిస్తామన్నారు. కరోనా చికిత్సలకు సంబంధించి అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశామని, మందులు సిద్ధంగా ఉంచామని తెలిపారు. చిన్న పిల్లల కోసం అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డు లు, వెంటిలేటర్లు, మందులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అవసరమైన వారందరికీ చికిత్సలు చేస్తామన్నారు.
ఆక్సిజన్ అందుబాటులో ఉంచాం
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పతుల్లో ఉన్న 27 వేల పడక లకు ఆక్సిజన్ సౌకర్యం సమకూర్చామని వివరిం చారు. 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నిర్మించామని.. దీనివల్ల ఆక్సిజన్ సామర్థ్యం 340 టన్నులకు పెరిగిందని చెప్పారు. 500 టన్నుల వరకు కూడా ఆక్సిజన్ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారని.. రాబోయే రోజుల్లో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత మున్న 56వేల కోవిడ్ పడకల్లో ఒక్క శాతమే ఆక్యు పెన్సీ ఉందన్నారు. కొద్దిపాటి జ్వరం, దగ్గు, ఆయా సం ఉంటే సబ్‌సెంటర్ లేదా ఇతర దవాఖానాలకు వెళ్లాలని సూచించారు. హోం ఐసోలేషన్ కిట్లు వాడితే 99 శాతం కరోనా తగ్గుతుందన్నారు. ఎవరికైనా తీవ్రమైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఏఎన్‌ఎంలకు సూచించామని మంత్రి వివరించారు. వెంటిలేటర్లను జిల్లా, ఏరియా ఆస్పత్రుల స్థాయిలోనూ సిద్ధం చేశామని తెలిపారు.
జ్వర సర్వేలో ప్రజాప్రతినిధులు: ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కూడా ఫీవర్ సర్వేలో పాల్గొనాలని హరీశ్‌రావు సూచించారు. కరోనా నేపథ్యంలో.. మేడారం జాతర విషయంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ముఖ్యమంత్రి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బూస్టర్ డోస్‌కు 9 నెలల కాలపరిమితి వల్ల సమస్య వస్తోందని.. బూస్టర్ డోస్ అందరికీ ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశామని వెల్లడించారు.
టెస్టులకు అధిక రేట్లు వసూలు చేయొద్దు
ప్రభుత్వ ఆస్పత్రులు, సబ్ సెంటర్లు, బస్తీ దవాఖా నాలు అన్నిచోట్లా కరోనా పరీక్షలు అందుబాటులో ఉన్నందున ప్రజలు ప్రైవేట్‌కు వెళ్లొద్దని హరీశ్‌రావు సూచించారు. ప్రైవేట్‌లో ఎక్కువ ధరకు టెస్టులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యాక్సిన్ విషయంగా పెద్ద రాష్ట్రాల్లో మనం బెస్ట్
వ్యాక్సినేషన్ విషయంలో పెద్ద రాష్ట్రాల్లో మనం ముందున్నామని హరీశ్‌రావు చెప్పా రు. ఫస్ట్ డోస్ నూటికి నూరు శాతం, సెకండ్ డోస్ 77% పూర్తి చేశామన్నారు. డోసుల మధ్య కాల పరిమితి ఎక్కువగా ఉండటం వల్ల రెండో డోసు త్వరగా పూర్తికావడం లేద న్నారు. తక్కువ వ్యాక్సినేషన్ ఉన్న జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేయమన్నామని తెలిపా రు. అన్ని జిల్లాల్లో మంత్రులను వ్యాక్సినే షన్‌పై రివ్యూ చేయమన్నామని.. 10–12 జిల్లాల్లో ఇప్పటికే చేశారని వివరించారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా బస్తీ దవాఖానాలు తెరిచి ఉంచాలని ఆదేశించామ న్నారు. ఎంతమంది వస్తే అందరికీ టెస్టులు చేయాలని సూచించినట్టు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment