Hero Prabhas Suffering From High Fever - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్స్‌ క్యాన్సిల్‌!

Published Tue, Feb 7 2023 1:17 PM | Last Updated on Tue, Feb 7 2023 2:00 PM

Prabhas Suffering From High Fever - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయ్యాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌ కే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ ...కూడా పూర్తి చేశాడు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇవన్నీ వందల కోట్ల బడ్జెట్లో రాబోతున్నాయి.

ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్-మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించే సినిమా రానుంది. వీటితో పాటు దిల్ రాజుతో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాను ప్రకటించేశాడు.ఇలా వరుస సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్‌.. తాజాగా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

(చదవండి: డ్రెస్సుపై ఒక్క చిరుగూ లేకుండా రేప్‌ సీన్‌లో నటించా: హీరోయిన్‌)

ప్రస్తుతం ప్రభాస్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే షూటింగ్స్‌ అన్ని క్యాన్సిల్‌ చేసుకొని ఇంటికి వెళ్లినట్లు ఫిల్మ్‌ వర్గాల సమాచారం. ఈ నెలలో మారుతి సినిమా కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్‌లో  ప్రారంభం కావాలి. ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం పాల్గొనాల్సింది. కానీ జ్వరం కారణంగా అది వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభాస్‌ సన్నిహితులు అంటున్నారు. విశ్రాంతి లేకుండా వరుస సినిమాల ఘూటింగ్స్‌లో పాల్గొనడం వల్లే ఆయన జ్వరం బారిన పడినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement