Health Department officials
-
ఒడిశాలో 180 మందికి స్క్రబ్ టైఫస్
భువనేశ్వర్: కేరళలో నిఫా వైరస్ మాదిరిగానే ఒడిశాలో స్క్రబ్ టైఫస్ ప్రజలను వణికిస్తోంది. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య ఆదివారానికి 180కి చేరుకుంది. ఇప్పటివరకు సేకరించి పంపిన 59 శాంపిళ్లలో 11 స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా వెల్లడైనట్లు ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు. మొత్తం 180 మంది బాధితుల్లో ఇతర రాష్ట్రాల వారు 10 మంది ఉన్నారన్నారు. సుందర్‌గఢ్, బర్గఢ్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని అన్నారు. ఈ వ్యాధితో రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. ఒక రకమైన లార్వా పురుగులు కుట్టడం వల్ల ఇది సోకుతుంది. పొలాలు, అటవీ ప్రాంతాలకు దగ్గర్లోని వారు తొందరగా ఈ వ్యాధికి గురవుతారు. జ్వరం, పురుగు కుట్టిన చోట చర్మంపై ఎశ్చర్ అనే నల్ల మచ్చ ఏర్పడటం దీని లక్షణాలు. -
అమెరికాలో ‘ఉల్లి’ హడల్!
అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం. హుషారుగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ దంపతులు.. తినేసి ఇంటికి వచ్చారు. కాసేపటికే ఇద్దరికీ జ్వరం, వాంతులు, విరేచనాలు.. వెంటనే వెళ్లి ఆస్పత్రిలో చేరారు. అక్కడే మరో పట్టణం.. ఇంట్లో భోజనం చేసి పడుకున్న కుటుంబ సభ్యులంతా తెల్లారే సరికి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇలా కొద్దిరోజుల్లోనే వందల మంది అనారోగ్యం పాలయ్యారు. అందరికీ ఒకే సమస్య ‘సాల్మోనెల్లోసిస్’. సాల్మోనెల్లాగా పిలిచే ఓ రకం బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి. అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా ఆరా తీసి.. ఇదెలా వ్యాపిస్తోందన్నది తేల్చారు. ఆ కారణం ఏమిటో తెలుసా.. జస్ట్ ఉల్లిపాయలు. దీంతో అమెరికావ్యాప్తంగా ఒక్కసారిగా ఉల్లి అంటే హడల్ మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు.. అక్కడి 37 రాష్ట్రాల్లో సాల్మోనెల్లోసిస్ బారినపడ్డ పేషెంట్ల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. వారు కొద్దిరోజులుగా ఏమేం తిన్నారు, ఎక్కడెక్కడికి వెళ్లారనేది ఆరా తీశారు. అన్నిచోట్లా కామన్‌గా వచ్చిన సమాధానం ఉల్లిపాయలే. ఇందులో చాలావరకు అమెరికాకు చెందిన ప్రోసోర్స్ అనే సంస్థ.. పొరుగుదేశమైన మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్నవే. దీంతో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెంటనే హైఅలర్ట్ జారీ చేసింది. ప్రోసోర్స్ సంస్థ ద్వారా సరఫరా అయిన ఉల్లిపాయలన్నింటినీ.. వెంటనే పారబోయాలని ఆదేశించింది. ఆ ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కూడా పడేయాలని.. ఆయా ప్రాంతాలను శానిటైజ్ చేయాలని సూచించింది. ► అమెరికాలో సిట్టెరో బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న ‘సలామీ స్టిక్స్ (మాంసాహార వంటకం)’తోనూ సాల్మోనెల్లా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లు, ఇతర దుకాణాల్లో ఉన్న స్టాక్‌ను పడేయాలని ఆదేశించారు. వృద్ధులు, పిల్లలకు డేంజర్! సాల్మోనెల్లా మరీ ప్రమాదకరం కాకున్నా.. వృద్ధులు, చిన్నపిల్లలకు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి మాత్రం డేంజరేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి వారిలో తీవ్ర జ్వరం, రక్త విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని.. శరీరంలో డీహైడ్రేషన్, ఇతర ఇన్ఫెక్షన్లు ఏర్పడి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రతే పరిష్కారం అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివాటి ద్వారా సాల్మోనెల్లాతోపాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ► పరిసరాల పరిశుభ్రత, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటం, మాంసం, పండ్లు, కూరగాయలు వంటివాటిని శుభ్రంగా కడిగి ఉపయోగించడం, ఆహారాన్ని సరిగా ఉడికించడం, పాలను బాగా మరగబెట్టడం వంటివాటి ద్వారా సాల్మొనెల్లా, ఈకొలికి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. ఏమిటీ ‘సాల్మోనెల్లా’? సాల్మోనెల్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్యాక్టీరియా. కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా మాంసాహారం, గుడ్లలో ఈ బ్యాక్టీరియా ఎదుగుతుంది. సరిగా కడగని పండ్లు, కూరగాయల మీద కూడా ఉంటుంది. అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివి ఈ బ్యాక్టీరియా పెరగడానికి, వ్యాపించడానికి కారణం. ► ప్రస్తుతం అమెరికాలో సాల్మోనెల్లా బారినపడ్డ వారిలో చాలా మంది.. సరిగా కడగని, పచ్చి ఉల్లిపాయలు తిన్నట్టు గుర్తించారు. ► శరీరంలో ప్రవేశించిన నాలుగైదు గంటల్లో ప్రభావం చూపించడం మొదలవుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. తీవ్ర నీరసం ఆవహిస్తుంది. సాధారణంగా వారం రోజుల్లోపే ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. మందులు వాడితే వేగంగా కోలుకోవచ్చు. -
------------
అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం. హుషారుగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ దంపతులు.. తినేసి ఇంటికి వచ్చారు. కాసేపటికే ఇద్దరికీ జ్వరం, వాంతులు, విరేచనాలు.. వెంటనే వెళ్లి ఆస్పత్రిలో చేరారు. అక్కడే మరో పట్టణం.. ఇంట్లో భోజనం చేసి పడుకున్న కుటుంబ సభ్యులంతా తెల్లారే సరికి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇలా కొద్దిరోజుల్లోనే వందల మంది అనారోగ్యం పాలయ్యారు. అందరికీ ఒకే సమస్య ‘సాల్మోనెల్లోసిస్’. సాల్మోనెల్లాగా పిలిచే ఓ రకం బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి. అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా ఆరా తీసి.. ఇదెలా వ్యాపిస్తోందన్నది తేల్చారు. ఆ కారణం ఏమిటో తెలుసా.. జస్ట్ ఉల్లిపాయలు. దీంతో అమెరికావ్యాప్తంగా ఒక్కసారిగా ఉల్లి అంటే హడల్ మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు.. అక్కడి 37 రాష్ట్రాల్లో సాల్మోనెల్లోసిస్ బారినపడ్డ పేషెంట్ల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. వారు కొద్దిరోజులుగా ఏమేం తిన్నారు, ఎక్కడెక్కడికి వెళ్లారనేది ఆరా తీశారు. అన్నిచోట్లా కామన్‌గా వచ్చిన సమాధానం ఉల్లిపాయలే. ఇందులో చాలావరకు అమెరికాకు చెందిన ప్రోసోర్స్ అనే సంస్థ.. పొరుగుదేశమైన మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్నవే. దీంతో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెంటనే హైఅలర్ట్ జారీ చేసింది. ప్రోసోర్స్ సంస్థ ద్వారా సరఫరా అయిన ఉల్లిపాయలన్నింటినీ.. వెంటనే పారబోయాలని ఆదేశించింది. ఆ ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కూడా పడేయాలని.. ఆయా ప్రాంతాలను శానిటైజ్ చేయాలని సూచించింది. ► అమెరికాలో సిట్టెరో బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న ‘సలామీ స్టిక్స్ (మాంసాహార వంటకం)’తోనూ సాల్మోనెల్లా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లు, ఇతర దుకాణాల్లో ఉన్న స్టాక్‌ను పడేయాలని ఆదేశించారు. వృద్ధులు, పిల్లలకు డేంజర్! సాల్మోనెల్లా మరీ ప్రమాదకరం కాకున్నా.. వృద్ధులు, చిన్నపిల్లలకు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి మాత్రం డేంజరేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి వారిలో తీవ్ర జ్వరం, రక్త విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని.. శరీరంలో డీహైడ్రేషన్, ఇతర ఇన్ఫెక్షన్లు ఏర్పడి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రతే పరిష్కారం అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివాటి ద్వారా సాల్మోనెల్లాతోపాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ► పరిసరాల పరిశుభ్రత, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటం, మాంసం, పండ్లు, కూరగాయలు వంటివాటిని శుభ్రంగా కడిగి ఉపయోగించడం, ఆహారాన్ని సరిగా ఉడికించడం, పాలను బాగా మరగబెట్టడం వంటివాటి ద్వారా సాల్మొనెల్లా, ఈకొలికి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. ఏమిటీ ‘సాల్మోనెల్లా’? సాల్మోనెల్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్యాక్టీరియా. కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా మాంసాహారం, గుడ్లలో ఈ బ్యాక్టీరియా ఎదుగుతుంది. సరిగా కడగని పండ్లు, కూరగాయల మీద కూడా ఉంటుంది. అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివి ఈ బ్యాక్టీరియా పెరగడానికి, వ్యాపించడానికి కారణం. ► ప్రస్తుతం అమెరికాలో సాల్మోనెల్లా బారినపడ్డ వారిలో చాలా మంది.. సరిగా కడగని, పచ్చి ఉల్లిపాయలు తిన్నట్టు గుర్తించారు. ► శరీరంలో ప్రవేశించిన నాలుగైదు గంటల్లో ప్రభావం చూపించడం మొదలవుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. తీవ్ర నీరసం ఆవహిస్తుంది. సాధారణంగా వారం రోజుల్లోపే ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. మందులు వాడితే వేగంగా కోలుకోవచ్చు. -
థియేటర్లు మళ్లీ బంద్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా హాళ్లను తిరిగి మూసివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఒకవేళ అది సాధ్యం కాకుంటే కనీసం సగం సీట్లు (50%) మాత్రమే నింపుకొనేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని కోరింది. తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త సినిమా విడుదలైతే థియేటర్లు 90 శాతంపైగా నిండిపోతున్నాయని, పైగా ప్రేక్షకులు మాస్కులు పెట్టుకోకుండా పక్కపక్క సీట్లలో కూర్చుంటున్నారని పేర్కొంది. తలుపులు మూసేసి ఏసీలు వేస్తుండటంతో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపింది. కాబట్టి సినిమా హాళ్లు, జిమ్‌లు, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సముదాయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేసింది. విద్యాసంస్థలను మూసివేయాలని పది రోజుల క్రితమే తాము ప్రతిపాదించామని, ఇప్పటికే ఆలస్యమైందని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. అందువల్ల సినిమా హాళ్ల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. మూడు నెలలపాటు వ్యాక్సిన్ల స్టాక్... రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి, రెండో డోసులతో కలుపుకొని 9.68 లక్షల వ్యాక్సి న్లు వేశారు. ప్రస్తుతం ఇంకా 12 లక్షల డోసులు రాష్ట్రంలో నిల్వ ఉన్నాయి. అయి తే వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా లు వేయాలంటే ఇప్పుడున్న డోస్‌లు సరి పోవు. కరోనా కేసులు పెరిగితే వ్యాక్సిన్లు వేసుకొనే వారి సంఖ్య కూడా అదేస్థాయి లో అధికమవుతుంది. ప్రస్తుతం నెలకు సరిపడా వ్యాక్సిన్లనే నిల్వ పెట్టుకుంటున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటం తో 3 నెలల వరకు సరిపడే వ్యాక్సిన్లను తెప్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు కరోనా బాధితులకు అవసరమైన మందులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కంపెనీలకు ఇండెంట్లు పెట్టారు. అన్ని ముఖ్యమైన ఆ సుపత్రుల్లోనూ కరోనా వార్డులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా సెకండ్ వేవ్! దేశవ్యాప్తంగా ఐదారు నెలల క్రితం తగ్గినట్లే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా వ్యాపిస్తోందని, వైరస్ వ్యాప్తి రెండో దశలోకి చేరుకుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మున్ముందు రోజురోజుకూ కేసులు మరింతగా పెరుగుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా జాగ్రత్తలు పాటించడమే అందుకు పరిష్కారమని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, అర్హులైన వారంతా వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు. మరోవైపు మాస్కులు పెట్టుకోకుంటే జరిమానా విధించాలని, పోలీసులు రోడ్లపైనా, మాల్స్ వద్ద, గుమిగూడే అన్ని ప్రాంతాల్లో దాడులు చేసి జరిమానాలు విధిస్తే నిర్లక్ష్యం వహించే వారిలో కదలిక వస్తుందని, భయంతోనైనా మాస్కులు పెట్టుకుంటారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఈ మేరకు పోలీసు శాఖకు ప్రతిపాదన చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 90 శాతం వరకు మాస్కులు ధరించకపోవడం వల్లేనని, మిగిలిన 10 శాతం కేసులు భౌతికదూరం పాటించకపోవడం, చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్లేనని ఒక అధికారి వ్యాఖ్యానించారు. అందువల్ల ఉన్నతస్థాయి వర్గాల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ మాస్కులు పెట్టుకోవాలని, ఆ మేరకు ప్రభుత్వం అవగాహనతోపాటు ధరించని వారికి జరిమానా విధించాలని కోరుతున్నారు. -
మీ ఇంట్లో శుభకార్యాలకు మారువేషాల్లో అధికారులు
సాక్షి, ముంబై: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, బారసాలు, పూజలు ఇతర శుభకార్యాలు జరిగే చోట ఆరోగ్య శాఖ సిబ్బంది పర్యటిస్తారని బీఎంసీ అదనపు కమిషనర్ సురేశ్ కాకాణి తెలిపారు. అక్కడ కరోనా నియమాలు పాటిస్తున్నారా...? లేదా..? ఎంతమంది హాజరయ్యారు...? ఒకవేళ ఉల్లంఘన జరిగితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. వీడియోలు పరిశీలన.. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తుండడంతో బీఎంసీ అధికారులకు కంటిమీద కినుకులేకుండా పోయింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా శుభకార్యాలు జరుగుతున్న పంక్షన్ హాళ్లకు, మైదానాల్లోకి బంధువుల రూపంలో బీఎంసీ సిబ్బంది మారువేషాల్లో వెళతారు. అక్కడ వేదికపై ఎంత మంది బంధువులున్నారు? 50 మంది బంధువుల కంటే ఎక్కువ ఉన్నారా..? కరోనా నియమాలు పాటిస్తున్నారా..? లేదా..? అనేది నిర్ధరించుకుంటారు. అవసరమైతే వీడియోగ్రాఫర్లు చిత్రీకరించిన క్లిప్పింగులను పరిశీలించే అధికారాలు కూడా సిబ్బందికి కట్టబెట్టినట్లు కాకాణీ చెప్పారు. ఒకవేళ మాస్క్‌లు ధరించని, భౌతిక దూరం పాటించని పక్షంలో నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారు. అవసరమైతే స్థానిక పోలీసు స్టేషన్లో కేసులు కూడా నమోదు చేస్తారు. నగరంలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో బీఎంసీ పరిపాలన విభాగం అనేక ఆంక్షలు విధించింది. ప్రైవేటు, వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయాల్లో 50 శాతం హాజరుండాలని నిబంధన విధించింది. కోవిడ్ నియమాలు కచ్చితంగా అమలుచేస్తున్నారా అనేది నిర్ధరించుకునేందుకు అకస్మాత్తుగా బీఎంసీ అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు. నియమాల ఉల్లంఘన జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి గతంలో కంటే ఇప్పుడే మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. చదవండి: (కరోనా విజృంభణ.. రెండు వారాలపాటు లాక్డౌన్) -
కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు
సాక్షి, అమరావతి: ఇప్పటికే 104 కాల్‌సెంటర్ ద్వారా కోవిడ్ బాధితులకు సత్వర సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. బాధితులకు అందుతున్న సేవలను నేరుగా పర్యవేక్షించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను అమర్చనుంది. ► రెండు రోజుల్లో ముందుగా 108 ఆస్పత్రుల్లో 2 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం దాదాపు రూ.3 కోట్లు ఖర్చు పెడుతోంది. ► ఆ తర్వాత మరో 35 ఆస్పత్రుల్లో కూడా సీసీ కెమెరాలు అమరుస్తారు. ► బాధితుల బంధువులు సమాచార లోపంతో ఇబ్బందులు పడకుండా వీటి ద్వారా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. తద్వారా ఎప్పటికప్పుడు చికిత్సపై వాకబు చేస్తారు. సీసీ కెమెరాల ద్వారా పక్కాగా పర్యవేక్షణ ► ఐసీయూ, నాన్ ఐసీయూ, జనరల్ వార్డులన్నింటిలో సీసీ కెమెరాలు. నేరుగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు పర్యవేక్షించడానికి వీలుగా వారికి సీసీ కెమెరా లింకులు. ► కోవిడ్ బాధితులకు సకాలంలో చికిత్స అందుతోందా? మందులు ఇస్తున్నారా? భోజనం పెడుతున్నారా? ఆక్సిజన్, వెంటిలేటర్ పడకల సౌలభ్యం వంటివన్నీ పర్యవేక్షించే వీలు. ► ఎక్కడైనా రోగులు అసౌకర్యంగా ఉన్నట్టు, ఇబ్బంది పడుతున్నట్టు అనుమానమొస్తే తక్షణమే ఆ ఆస్పత్రి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు. ► డ్యూటీలో ఉన్న వైద్యులే చికిత్సకు బాధ్యులు ► రోగుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించినా, నిర్లక్ష్యంగా ప్రవర్తించినా తక్షణమే చర్యలు ► ప్రతి ఆస్పత్రికి సంబంధించిన అధికారి మొబైల్ ఫోన్ నంబర్‌ను డిస్ప్లే బోర్డులో ఉంచుతారు. ► ఎవరైనా అధికారులు, వైద్యులు సకాలంలో స్పందించకపోతే 104కు కాల్ చేసి 2 నొక్కితే పూర్తి వివరాలు బాధితుడి సహాయకులు లేదా బంధువులకు అందిస్తారు. ► సీసీ కెమెరాలతో ఏ ఆస్పత్రిలో ఏం జరుగుతోందో నేరుగా తెలుసుకుని బాధితులకు సత్వర న్యాయం అందిస్తారు. -
హీరోలకు అండగా ఉందాం
‘‘ప్రస్తుతం అందరం కష్టకాలంలో ఉన్నాం. ఈ సమయంలో మనందరి కోసం పోరాడుతున్న హీరోలకు (వైద్య శాఖ, ఇతర అత్యవసర సిబ్బంది) మనం అండగా నిలబడాలి’’ అంటున్నారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. చెప్పినట్లే నిలబడుతున్నారు ఆయన. ముంబైలో సోనూకి ఓ హోటల్ ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల అది మూసివేశారు. అయితే ఆరోగ్యశాఖలో పని చేస్తున్నవాళ్లు వినియోగించుకునేందుకు వీలుగా ఆ హోటల్ ను తెరచి ఉంచబోతున్నట్టు ప్రకటించారు సోను. ‘‘వాళ్లు చేస్తున్న దానితో పోలిస్తే నేను చేస్తున్నది పెద్ద సహాయం కూడా కాదు. మనందరం కలసి ఈ సమస్య (కరోనా)ను దాటుదాం’’ అని పేర్కొన్నారు సోనూ సూద్. -
కరోనా: హీరో విజయ్ ఇంటిలో ఆరోగ్యశాఖ తనిఖీ
సౌత్ స్టార్ హీరో విజయ్ తళపతి ఇంటిని ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ఇళ్లను ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి కరోనా వైరస్ బారిన పడ్డవారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకోసం గత రెండు, మూడు నెలల్లో విదేశాలకు వెళ్లిన వారి జాబితాను తీసుకుని వారందరి ఇళ్లను అధికారులు సందర్శిస్తున్నారు. (రెండు లక్షల వరకు కరోనా మృతులు) ఇక ఈ జాబితాలో హీరో విజయ్ కూడా ఉండటంతో చెన్నైలోని ఆయన నీలంకరి నివాసాన్ని కూడా అధికారులు సందర్శించారు. కాగా వైద్యులు విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించి ఈ మహమ్మారి బారిన ఆయన కుటుంబ సభ్యులేవరు పడలేదని నిర్ధారించారు. అంతేగాక ఆరు నెలల ముందు విజయ్ మీనహా ఆయన కుటుంబ సభ్యులేవరు విదేశాలకు వెల్లలేదని నిర్థారించుకుని ఇంటిలో శానిటైజర్ స్ర్పే చేసి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా పేర్కొంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. (హైదరాబాద్‌లో కరోనా మరణం.. అంత్యక్రియలు పూర్తి) -
కోవిడ్‌తో విలవిల..
బీజింగ్: చైనాలో కోవిడ్–19 మృతుల సంఖ్య రోజురోజుకూ ఎగబాకుతోంది. ఇప్పటివరకూ ఈ వైరస్ బారిన పడి 1,523 మంది మరణించగా మొత్తం 66వేల మంది దీని బారినపడినట్లు నిర్ధారణ అయిందని చైనా ఆరోగ్య కమిషన్ శనివారం వెల్లడించింది. చైనా మొత్తమ్మీద కోవిడ్ బారిన పడినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 66,492కు చేరుకోగా, వీరిలో 11, 053 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య 8096కు పెరిగింది. కోవిడ్ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ తగ్గుతోందని చైనా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించిందని, వ్యాధికి కేంద్రబిందువుగా భావిస్తున్న హుబే ప్రాంతం మినహా మిగిలిన చోట్ల తగ్గుదల నమోదవుతోందని తెలిపింది. ఇదిలా ఉండగా.. కోవిడ్–19ను నియంత్రించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా వంటి టెక్నాలజీలను వాడాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఆ తల్లీ బిడ్డ డిశ్చార్జ్ కోవిడ్ బారినపడ్డ 67 రోజుల వయసున్న పసిబిడ్డ చికిత్స తర్వాత∙ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి విడుదలైంది. జియాంగ్ అనే ఇంటిపేరున్న ఈ బిడ్డను హుబేలోని సెంట్రల్ ఆసుపత్రిలో చేర్చారు. గుయిఝూ ప్రాంతం నుంచి సెలవులు గడిపేందుకు గత నెల 16న హుబే వచ్చిన జియాంగ్ తల్లిదండ్రులకు వ్యాధి సోకినట్లు జనవరి 25న నిర్ధారణ అయింది. ఇదే సమయంలో బిడ్డలోనూ వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో ఫిబ్రవరి రెండవ తేదీ జియాంగ్ను ఆసుపత్రిలో చేర్పించడం తెల్సిందే. వచ్చే వారం 406 మంది విడుదల? ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వూహాన్ నుంచి తీసుకొచ్చి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కేంద్రాల్లో పర్యవేక్షణలో ఉంచిన 406 మందిని వచ్చే వారం విడుదల చేసే వీలుంది. కోవిడ్ సోకలేదని నిర్ధారణ చేసుకున్నాకే విడుదలచేస్తారని అధికారులు శనివారం తెలిపారు. 650లో 406 మందిని న్యూఢిల్లీలోని ఐటీబీపీ కేంద్రాల్లో పర్యవేక్షణలో ఉంచగా, మిగిలిన వారిని మానేసర్‌లోని సైనిక శిబిరంలో పర్యవేక్షణలో ఉంచారు. ఆ కరెన్సీ నోట్ల చలామణీ బంద్ కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చైనా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వైరస్‌ను నియంత్రించే లక్ష్యంతో తాజాగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధికి కేంద్రబిందువుగా భావిస్తున్న ప్రాంతాల్లోని కరెన్సీ నోట్ల చలామణీని తాత్కాలికంగా ఆపేశారు. ఈ నోట్ల ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుందేమో అన్న అనుమానంతో ఈ చర్యలు చేపట్టినట్లు అంచనా. పాతనోట్ల స్థానంలో కొత్తనోట్లు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వైస్ గవర్నర్ ఫాన్ వైఫీ తెలిపారు. కోవిడ్‌కు విరుగుడుగా చైనా వైద్యం? కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చైనా సంప్రదాయ వైద్యాన్ని సమర్థంగా ఉపయోగిస్తోంది. వ్యాధి సోకిందని నిర్ధారణ అయిన వారిలో కనీసం సగంమందికి సంప్రదాయ వైద్యంతో సాంత్వన చేకూరిందని చైనా ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న హుబేలో తాము అల్లోపతితోపాటు చైనీస్ వైద్యం అందించడం మొదలుపెట్టామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఉపాధ్యక్షుడు వాంగ్ హెషింగ్ తెలిపారు. అల్లోపతి వైద్యంలో కరోనా వైరస్ నివారణకు నిర్దిష్టమైన చికిత్సలేకపోవడంతో ఈ వార్తకు ప్రాధాన్యమేర్పడింది. -
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమగ్ర సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచి మంచి ఫలితాలు సాధించే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అందరికి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం వైద్యం కూడా అందాలని అధికారులకు సీఎం ఆదేశించనున్నారు.ఇప్పటికే నివేదికలు తయారుచేసిన ఇరుశాఖల అధికారులు వాటిని సీఎంకు సమర్పించనున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పథకాలను రూపొందించాలని ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు పెద్ద పీఠ వేస్తామని వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో ప్రకటించగా.. దానికి అనుగుణంగా ఉచిత వైద్యంపై కసరత్తు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా వైద్య, ఆరోగ్య సమీక్ష అనంతరం మధ్యాహ్నాం జల వనరులు శాఖపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బాలింతలకూ నోటు కష్టాలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు ఆర్.శాంతి. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నాయకన్ తండాకు చెందిన ఈమె పదిరోజుల క్రితమే నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రిలో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేయించుకున్న శాంతికి జననీ సురక్ష యోజన కింద రూ.1000 విలువ గల చెక్కును ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చారు. దానిని నగదుగా మార్చుకునేందుకు శాంతి శనివారం హాలియా ఎస్‌బీహెచ్‌కు వచ్చింది. లైన్ చాంతాడంత పొడవు ఉండడంతో బ్యాంక్‌లో ఉన్న ఓ కుర్చీపై ఇలా నవజాత శిశువును పడుకోబెట్టి పడిగాపులు కాసింది. కాసేపటికే మరో బాలింత కూడా నవజాత శిశువును శాంతి పక్కనే పడుకోబెట్టి లైన్లో నిలబడింది. నగదు కొరత కారణంగా నాలుగు గంటలు నిరీక్షించిన అనంతరం అధికారులు కనికరించడంతో మధ్యాహ్నం 3 గంటలకు చెక్కును మార్చుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. -
పెరుగుతున్న డెంగీ కేసులు
వాతావరణంలో మార్పులు కారణం అప్రమత్తమవుతున్న ఆరోగ్యశాఖ అధికారులు కోలారు : నగరంలో వాతావరణంలో ఏ ర్పడిన మార్పుల కారణంగా డెంగీ జ్వ రం పెరుగుతోంది. నగరంలోని అంబేద్కర్ నగర్‌తో పాటు ఇతర ప్రాంతాలలో పలువురు జ్వరంతో బాధపడుతున్నారు. ఇంతవరకు 13 డెంగీ కేసులు ధ్రువీకరిం చబడ్డాయి. ఒకటిన్నర నెల రోజు లు గా జిల్లాలో అడపా దడపా వానలు పడి, నీరు నిలువ ఉండడమే దీనికి కారణం. దీనికి తోడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతు న్న వారు కూడా ఎక్కువగానే ఉన్నా రు. బంగారుపేట సర్కల్ సమీపంలోని అంబేద్కర్ కాలనీలో ఉన్న పలువురికి డెంగీ సోకినట్లు అనుమానంతో ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్తపరీక్షలో ప్లేట్లెట్ల సంఖ్య త క్కువ కనపడితే డెంగీ అనే అనుమానంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్వచ్ఛత కొరత అంబేద్కర్ నగర్లో స్వచ్ఛత కొరత వల్ల ఈ సమస్యలు తలెత్తున్నాయి. రోడ్డు పక్కనే చెత్తాచెదారం వేయడంతో వాన వచ్చిన సమయంలో దోమలు ప్రబలుతున్నాయి. ఆరోగ్య శాఖ డెంగీ నివారణ గు రించి ఎంతగా ప్రచారం చేస్తున్నా పలువురు నీటిని ఎక్కువ కాలం నిలువ ఉంచడంతో కూడా డెంగీ కలిగించే దోమలు ప్రబలి స్థానిక ప్రజలు జ్వరాల బారిన ప డుతున్నారు. చెత్తను నగరసభ తీయక పోవడంతో దుర్వాసన, తద్వారా దోమలు అధిక మవుతున్నాయి. 13 డెంగీ కేసులు నగరంలో గత జనవరి నుంచి ఇంత వరకు 13 డెంగీ కేసులు మాత్రమే ధ్రు వీకరించబడ్డాయి. వానా కాలం మరింత అధిక మవుతుందేమో అనే ఆందోళనలో ప్రజలు ఉంది. కోలారులో 12, బంగారుపేటలో 1 డెంగీ కేసులు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. దీనికి తోడు చికెన్ గున్యా కూడా విజృంభిప్తోం ది. ఇంతవరకు 18 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. 5 మలేరియా కేసులు కూడా నమోదు కావడం గమనార్హం. ఇంటింటా సర్వే జిల్లా వ్యాప్తంగా 5 నెలల కాలం పాటు ప్రతి ఇంటా లార్వా సర్వే కార్యాన్ని చేపట్టాం. ప్రతి తాలూకాలో 5 వేల ఇళ్లలో స ర్వే చేపట్టాము. జిల్లా వ్యాప్తంగా 40 వేల ఇళ్లలో సర్వే నిర్వహిస్తున్నాం . - డాక్టర్ వినయ్‌ఫడ్, మలేరియా నియంత్రణాధికారి -
సన్డే
►పెరుగుతున్న వడదెబ్బ మృతులు ►61 మంది మృతి నెల్లూరు (అర్బన్) : సూరీడు నిప్పులు అలాగే కురిపిస్తున్నాడు. గ్రీష్మ తాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. దీంతో జిల్లాలో ఎండ తీవ్రత అలాగే ఉంది. జూన్ పదో తేదీ కత్తెర వరకు సూర్యతాపం ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు గ్యాప్ లేకుండా పనిచేస్తూనే ఉన్నాయి. అయినా ప్రజలు వేసవి తాపాన్ని భరించలేకపోతున్నారు. ఆదివారం 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి వడగాడ్పులు వీచాయి. నాలుగు రోజులుగా పరిస్థితి ఇలాగే ఉంది. గురువారం 43.8 డిగ్రీలు, శుక్రవారం 42.4 డిగ్రీలు, శనివారం 42.1 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం వరకు వడదెబ్బ కారణంగా 85 మంది చనిపోగా ఆదివారం. జిల్లా వ్యాప్తంగా 61 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కాగా ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వడదెబ్బబారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని ఆదేశించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ భారతీరెడ్డి చెప్పారు. వడదెబ్బ మృతులు ముగ్గురేనా? వడదెబ్బకు ఒక వైపు జనం పిట్టల్లా రాలుతోంటే అధికారులు ముగ్గురు మాత్రమే చనిపోయినట్లు నిర్ధారిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు వడదెబ్బకు 126 మంది చనిపోయారని అనుమానిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురు మాత్రమే వడదెబ్బకు చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. వడదెబ్బకు చనిపోయారా? లేదా? అని నిర్ధారించే విషయంలో అధికారులు నెమ్మదిగానే ఉన్నారు. నిబంధనల ప్రకారం ఎస్ఐ, తహశీల్దార్, మెడికల్ ఆఫీసర్ నిర్ధారించాల్సి ఉంది. ఐదు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఎక్కువై పలువురు మృత్యువాత పడుతోంటే అధికారులు నిర్ధారించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
కోల్డ్‌వార్
సాంబమూర్తినగర్ (కాకినాడ) :ప్రభుత్వ శాఖల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు పర్యవేక్షకులుగా తహశీల్దార్లు, ఎంపీడీఓలను నియమిస్తూ ఇటీవల కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఉత్తర్వులను నిరసిస్తూ విధులు బహిష్కరించారు. రవిచంద్ర కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కొంతమంది వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారని, నీతూ ప్రసాద్ ఏ శాఖలోనూ అమలు చేయని బయోమెట్రిక్ విధానాన్ని వైద్య శాఖలోనే అమలు చేశారని ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఎవరు కలెక్టర్‌గా పనిచేసినా వైద్య ఉద్యోగులను దొంగలుగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పవర్ మొత్తాన్ని ఐటీడీఏ పీఓకు బదలాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కూడా వారు తప్పుబడుతున్నారు. ఒక పక్క సొంత శాఖ లోని అధికారుల ఒత్తిడి, మరో పక్క ఇతర శాఖల అధికారుల పెత్తనం వల్ల తాము మానసిక వేదనకు గురవుతున్నామని పేర్కొంటున్నారు. అయితే రెవెన్యూ శాఖ వాదన మరోలా ఉంది. వైద్య, ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విపత్కర పరిణామాలు సంభవిస్తున్నాయని, అయితే వైద్య, ఆరోగ్య శాఖ మరో భాగమేమీ కాదని ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు అన్ని శాఖలూ కలిసే ఉండేవని, ఆయన వచ్చిన తర్వాత మెరుగైన వైద్య సేవల నిమిత్తం వైద్య శాఖను వేరుచేశారని చెబుతున్నారు. తాము వైద్య ఉద్యోగులపై పెత్తనం చలాయించేదేమీ లేదని, వారి పనితీరు మెరుగుపరిచేందుకు పర్యవేక్షకులుగా మాత్రమే వ్యవహరిస్తున్నామని పేర్కొంటున్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలు, ఇతర వ్యాధులు ప్రబలి అత్యవసర పరిస్థితులు ఏర్పడడానికి క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, కలెక్టర్ వారిపై పర్యవేక్షకులుగా రెవెన్యూ అధికారులను నియమించారని చెబుతున్నారు. అయితే దీనిని వైద్య ఉద్యోగులు వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సావిత్రమ్మకు వినతిపత్రం అందజేశారు. పది రోజుల్లోగా తమ డిమాండ్లపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, లేకుంటే విధులు బహిష్కరించి వివిధ రూపాల్లో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఆరోగ్యశాఖ ప్రధాన డిమాండ్లివే... ఇతర శాఖల పెత్తనంతో కూడిన ప్రత్యేకాధికారి నియామక ఉత్తర్వులు రద్దు చేయాలి. పర్యవేక్షణకు వైద్య శాఖ అధికారులను మాత్రమే నియమించాలి. బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలి. వైద్య సిబ్బందిని బహిరంగంగా విమర్శించే విధానాన్ని విడనాడాలి. సిబ్బంది గౌరవం పెంచేలా చర్యలు చేపట్టాలి. అనవసరపు మీటింగ్‌లు, కాన్ఫరెన్స్‌లకు స్వస్తి పలకాలి. జాబ్‌చార్ట్ విధానాన్ని మాత్రమే కొనసాగించాలి. ఆధార్ సీడింగ్ నిమిత్తం వైద్య సిబ్బందిని బ్యాంకుల చుట్టూ తిప్పే విధానాన్ని విడనాడాలి. ఏజెన్సీలో అడిషనల్ డీఎంహెచ్‌ఓకే అధికారాలు కల్పించాలి.