హీరోలకు అండగా ఉందాం | Acto rSonu Sood Offers His Juhu Hotel To COVID-19 Medical Staffs | Sakshi
Sakshi News home page

హీరోలకు అండగా ఉందాం

Published Fri, Apr 10 2020 3:34 AM | Last Updated on Fri, Apr 10 2020 3:34 AM

Acto rSonu Sood Offers His Juhu Hotel To COVID-19 Medical Staffs - Sakshi

సోనూ సూద్‌

‘‘ప్రస్తుతం అందరం కష్టకాలంలో ఉన్నాం. ఈ సమయంలో మనందరి కోసం పోరాడుతున్న హీరోలకు (వైద్య శాఖ, ఇతర అత్యవసర సిబ్బంది) మనం అండగా నిలబడాలి’’  అంటున్నారు బాలీవుడ్‌ నటుడు సోనూ  సూద్‌. చెప్పినట్లే  నిలబడుతున్నారు ఆయన. ముంబైలో సోనూకి ఓ హోటల్‌ ఉంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ వల్ల అది మూసివేశారు. అయితే ఆరోగ్యశాఖలో పని చేస్తున్నవాళ్లు వినియోగించుకునేందుకు వీలుగా ఆ హోటల్‌ ను  తెరచి ఉంచబోతున్నట్టు ప్రకటించారు సోను. ‘‘వాళ్లు చేస్తున్న దానితో పోలిస్తే నేను చేస్తున్నది పెద్ద సహాయం కూడా కాదు. మనందరం కలసి ఈ సమస్య (కరోనా)ను దాటుదాం’’ అని పేర్కొన్నారు సోనూ సూద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement