
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమగ్ర సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచి మంచి ఫలితాలు సాధించే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అందరికి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం వైద్యం కూడా అందాలని అధికారులకు సీఎం ఆదేశించనున్నారు.ఇప్పటికే నివేదికలు తయారుచేసిన ఇరుశాఖల అధికారులు వాటిని సీఎంకు సమర్పించనున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పథకాలను రూపొందించాలని ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు పెద్ద పీఠ వేస్తామని వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో ప్రకటించగా.. దానికి అనుగుణంగా ఉచిత వైద్యంపై కసరత్తు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా వైద్య, ఆరోగ్య సమీక్ష అనంతరం మధ్యాహ్నాం జల వనరులు శాఖపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి