సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్‌పై మళ్లీ డెంగీ, మలేరియా వ్యాధులు పంజా విసురుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గత మూడు మాసాల్లో 20 డెంగీ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. తాజాగా మరో 14 డెంగీ, 12 మలేరియా కేసులు నమోదయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. మురికివాడల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదు అవుతుండగా, ఐటీ అనుబంధ పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాలు, ధనవంతులు అధికంగా నివసించే కాలనీల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తాజా గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షా నికి తోడు...రోజుల తరబడి ఫాగింగ్ నిర్వహించకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి.
గ్రేటర్‌లో ప్లాస్మోడియం పాల్సీఫారమ్ మలేరియా:
మలేరియాలో ప్రమాదకరమైన ప్లాస్మోడియం పాల్సీఫారమ్(పీఎఫ్) నగరంలో ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో ఎక్కడో గిరిజన, అటవీ ప్రాంతాల్లో ఈ రకం కనిపించేది. ప్రస్తుతం నగరంలోనూ వ్యాపిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. మూడు నెలల్లో వందకు పైగా కేసులు నమోదు కావడం ఆందో ళన కలిగిస్తోంది. ప్లాస్మోడియం అనే పరాన్న జీవి ద్వారా మలేరియా సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల ఇది వస్తుంది. మలేరియాలో ప్లాస్మోడియం వైవాక్స్(పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారమ్(పీఎఫ్) అనేవి రెండు రకాలు. పీవీ వ్యాపించినప్పుడు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు ఉంటాయి.
మందులు వాడితే తగ్గిపోతుంది. అంత ప్రమాదకరమైనది కాదు. కానీ పీఎఫ్ మలేరియా చాలా ప్రమాదకరమైనది. దీన్ని వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి లేదంటే కాలేయం, మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. మెదడుపైనా దాడి చేసి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదు. దోమ కుట్టిన పది నుంచి ప ద్నాలుగు రోజుల్లో జ్వరం వస్తుంది. డెంగీ లక్షణాలతో బాధపడే వారికి కొంతమంది స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటారని, అయితే ఇవి వ్యాధి లక్షణాలను మరింత పెంచుతాయని మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్ డాక్టర్ రాహుల్ అగర్వాల్ తెలిపారు. పారాసిటమాల్ తప్పఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment