దేశంలో 80 వేల మందికి డెంగీ
7.42 లక్షల మలేరియా కేసులు నమోదు
మలేరియాతో 188.. డెంగీతో 166 మంది మృతి
- తెలంగాణలో 1,916 డెంగీ కేసులు.. మృతులు ముగ్గురు!
- 1,765 మలేరియా కేసులు
- ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య పరిస్థితి ఇదీ..
- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. ఏడేళ్లలో ఏకంగా మూడు రెట్లు అధికంగా డెంగీ కేసులు నమోదయ్యారుు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సోమవారం ఈ మేరకు ఒక నివేదికలో తెలిపింది. అలాగే మలేరియా కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నారుు. పారిశుధ్య లోపం, దోమల స్వైర విహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారుు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా 79,800 డెంగీ కేసులు నమోదు కాగా.. 166 మంది చనిపోరుునట్లు కేంద్రం తన నివేదిక వెల్లడించింది. 2010లో 28,292 డెంగీ కేసులు నమోదవగా.. 110 మంది చనిపోయారు. ఆ తర్వాత ఏడాదికేడాదికి కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. 2012లో ఏకంగా 50 వేల మందికి డెంగీ సోకగా... 242 మంది చనిపోయారు. 2013లో 75,808 డెంగీ కేసులు నమోదు కాగా.. 193 మంది మృత్యువాత పడ్డారు. 2015లో లక్ష డెంగీ కేసులు నమోదుకాగా... 220 మంది చనిపోయారు. అలాగే మలేరియా కేసులు ఈ ఏడాది ఇప్పటివరకు 7.42 లక్షలు నమోదయ్యారుు. 188 మంది చనిపోయారు. గతేడాది 11.69 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా... 384 మంది మరణించారు.
రాష్ట్రంలో ముగ్గురేనట
తెలంగాణలో డెంగీతో ముగ్గురు మాత్రమే చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అరుుతే ఇటీవల ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఏకంగా 22 మంది చనిపోయారని వెల్లడైంది. దీన్ని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఒప్పుకోవడం లేదు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,916 డెంగీ కేసులు నమోదయ్యాయని కేంద్ర నివేదికలో వెల్లడించారు. దేశంలో ఈ ఏడాది అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 29 మంది డెంగీతో చనిపోయారు. ఆ రాష్ట్రంలో 5,456 డెంగీ కేసులు నమోదయ్యారుు. పశ్చిమ బెంగాల్‌లో 11 వేల డెంగీ కేసులు నమోదు కాగా... 28 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 5,391 డెంగీ కేసులు నమోదు కాగా... 22 మంది చనిపోయారు. కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో 12 మంది చొప్పున డెంగీతో మరణించారు. మలేరియా కేసులు దేశంలో అత్యధికంగా ఒడిశాలో నమోదయ్యారుు. ఆ రాష్ట్రంలో ఏకంగా 3.36 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా... 65 మంది చనిపోయారు. పశ్చిమ బెంగాల్‌లో 22,030 కేసులు నమోదు కాగా.. 55 మంది చనిపోయారు. మేఘాలయలో 28,973 కేసులు రికార్డు కాగా.. 33 మంది మరణించారు. తెలంగాణలో మలేరియా కేసులు 1,765 నమోదు కాగా.. ఒక్కరూ చనిపోలేదని కేంద్ర నివేదిక వెల్లడించింది.