దేశంలో 80 వేల మందికి డెంగీ | Dengue in the country to 80 thousand people | Sakshi

Nov 8 2016 7:55 AM | Updated on Mar 22 2024 11:21 AM

దేశవ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. ఏడేళ్లలో ఏకంగా మూడు రెట్లు అధికంగా డెంగీ కేసులు నమోదయ్యారుు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సోమవారం ఈ మేరకు ఒక నివేదికలో తెలిపింది. అలాగే మలేరియా కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నారుు. పారిశుధ్య లోపం, దోమల స్వైర విహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారుు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా 79,800 డెంగీ కేసులు నమోదు కాగా.. 166 మంది చనిపోరుునట్లు కేంద్రం తన నివేదిక వెల్లడించింది. 2010లో 28,292 డెంగీ కేసులు నమోదవగా.. 110 మంది చనిపోయారు. ఆ తర్వాత ఏడాదికేడాదికి కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. 2012లో ఏకంగా 50 వేల మందికి డెంగీ సోకగా... 242 మంది చనిపోయారు. 2013లో 75,808 డెంగీ కేసులు నమోదు కాగా.. 193 మంది మృత్యువాత పడ్డారు. 2015లో లక్ష డెంగీ కేసులు నమోదుకాగా... 220 మంది చనిపోయారు.

Related Videos By Category

Advertisement
Advertisement

పోల్

Advertisement