► డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావు
బోనకల్ (ఖమ్మం జిల్లా): పారిశుద్ధ్యలోపంతోనే ఈ ఏడాది ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా 650 డెంగీ కేసులు నమోదయ్యయని డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావు అన్నారు. ఖమ్మం శ్రీరక్ష ఆసుపత్రి, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 650 డెంగీ కేసులో నమోదు కాగా అత్యధికంగా జోనకల్ మండలంలోనే ఉన్నాయన్నారు. మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టిఅంతా బోనకల్ మండలంపైనే ఉందన్నారు. పారిశుద్ధ్య లోపంవల్లే విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు.
ఖమ్మంలో 650 డెంగ్యూ కేసులు
Published Wed, Oct 5 2016 5:51 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
Advertisement
Advertisement