దేశ రాజధాని న్యూఢిల్లీలో సెప్టెంబర్ 26 నాటికి 5,982 డెంగీ కేసులు నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో సెప్టెంబర్ 26 నాటికి 5,982 డెంగీ కేసులు నమోదు అయినట్టు అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. డెంగీ వ్యాధి కారణంగా అధికారకంగా 17 మంది మృత్యువాత పడినట్టు సోమవారం అధికారికంగా పేర్కొంది. మరోవైపు అనాధికారికంగా డెంగీ మరణాల సంఖ్య 60కి చేరినట్టు మీడియా వెల్లడించింది.
అయితే 2010 లో అత్యధికంగా డెంగీ కేసులు 6 వేలు నమోదు కాగా, 2011 లో 1,131 , 2012 లో 2,093, 2013 లో 5,574, 2014లో 995 కేసులు నమోదు అయ్యాయి. డెంగీ మరణాల సంఖ్య 2010లో 8, 2011లో 8, 2012 లో 4, 2013 లో 6, 2014 లో 3 గా నమోదయ్యాయి.