ఒడిశాలో భారీగా డెంగ్యూ కేసులు | Dengue cases rise to 5,535 in Odisha | Sakshi
Sakshi News home page

ఒడిశాలో భారీగా డెంగ్యూ కేసులు

Published Sat, Nov 8 2014 12:00 PM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

ఒడిశాలో ఈ ఏడాది భారీగా డెంగ్యూ కేసులు నమోదైయ్యాయి.

ఒడిశాలో  ఈ ఏడాది భారీగా డెంగ్యూ కేసులు నమోదైయ్యాయి.  ఇప్పటివరకు  5,535 డెంగ్యూ కేసులు  నమోదైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా శనివారం మరో 31 డెంగ్యూ  కేసులు నిర్దారణ అయినట్టు తెలిపారు. మరోవైపు ఇప్పటివరకూ నమోదైన  11 డెంగ్యూ కేసులు జైపూర్ తీరప్రాంతంలోనని నివేదికలో  వెల్లడైంది.  దాంతోపాటు జగత్సింగ్పూర్ జిల్లాలో కూడా 8కేసులు నమోదైయ్యాయి.

ఇప్పటికే డెంగ్యూ వైరస్ సోకిన 73మంది బాధితులు ప్రస్తుతం కటక్లోని చంద్ర బంజా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.  వీరిలో ఐదుగురికి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. అయితే గత ఏడాది 6వేల 753మందికి డెంగ్యూ పరీక్షలు చేయగా వారందరికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement