
బెంగాల్ ను వణికిస్తున్న డెంగ్యూ
డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని డెంగ్యూ జ్వరం వణికిస్తోంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ప్రజలు డెంగ్యూ బారిన పడ్డారు. రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం నివారణ చేపట్టింది. ప్రభుత్వాసుపత్రులు డెంగ్యూ జ్వరం బాధితులతో నిండిపోయాయి.
కోల్కతా, దక్షిణ బెంగాల్ లో అత్యధికంగా ఈ మహమ్మారి బారిన పడ్డారని సిలిగురి మేయర్ అశోక్ భట్టాచార్య తెలిపారు. డెంగ్యూ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్య ఇబ్బందిని అప్రమత్తం చేశామని, రోగులకు అవసరమైన అన్ని సేవలు అందించాలని ఆదేశించినట్టు చెప్పారు.