
బెంగళూరు/న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే అనుచిత వ్యాఖ్యల ప్రహసనం కొనసాగుతోంది. హిందూ మహిళలపై చేయి వేసిన వారి చేతులు నరికేయాలంటూ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్య చేసిన హెగ్డే.. సోమవారం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూ రావుపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఒక ముస్లిం మహిళ వెనుక పరిగెత్తిన వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. ముస్లిం యువతిని దినేశ్ గుండూరావు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.(‘తాజ్‌మహల్.. ఒకప్పటి శివాలయం’)
దీనిపై గుండూరావు భార్య తబస్సుమ్ స్పందిస్తూ.. తాను రాజకీయాల్లో లేని ఒక సాధారణ మహిళనని, ఒక వివాహిత మహిళ చీర వెనుక దాక్కొని రాజకీయాలు చేయడం ఆపేయాలని హెగ్డేకు సూచించారు. వ్యక్తిగత అంశాలను తెరపైకి తెచ్చే స్థాయికి దిగజారారంటూ హెగ్డేను గుండూరావు విమర్శించారు. మరోవైపు హెగ్డే ఆదివారం చేసిన వ్యాఖ్యలకు స్పందనగా.. హిందువు అయిన తన భార్యపై చేతులేసి దిగిన ఒక ఫోటోను మహారాష్ట్ర బీజేపీ నేత తెహసీన్ పూనావాలా ట్వీట్ చేశారు. ‘హిందూ మహిళపై చేయి వేసాను.. ఏం చేస్తావో చేసుకో’ అంటూ హెగ్డేకు సవాలు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment