Ananth Kumar Hegde
-
గాందీజీ అంటే నాకు ఎంతో గౌరవం: ఎంపీ హెగ్డే
-
గాంధీజీపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
బనశంకరి : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే శనివారం మహాత్మాగాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్యాగ్రహం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని, ఇలాంటి వ్యక్తి దేశానికి మహా పురుషుడా..? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అనంతకుమార్ హెగ్డే మాట్లాడుతూ.. ఎవరు దేశం కోసం ఆయుధాలు పట్టుకుని పోరాటం చేశారో వారందరూ ఉరికి వేలాడారని, ఎవరు తమ సిద్ధాంతాలు, వాదనలతో దేశ నిర్మాణం కోసం ప్రయత్నించారో వారందరూ చీకటి గదుల్లో మగ్గిపోయారని అన్నారు. ఎవరు బ్రిటీషు వారితో ఒప్పందం కుదుర్చుకుని స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారని సర్టిఫికెట్ తీసుకున్నారో వారందరూ నేటి చరిత్ర పుటల్లో విరాజిల్లుతున్నారని చెప్పారు. ఇదంతా దేశం చేసుకున్న దైర్భాగ్యం అంటూ గాంధీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో మూడు వర్గాలు ఉండేవని, ఒకరు విప్లవకారులు, మరొకరు ఆయుధాలు పట్టుకున్నవారు, మరో వర్గం ప్రముఖ జాతీయవాదులని తెలిపారు. బెంగుళూరు హిందుత్వ రాజధాని కావాలని, ప్రపంచాన్ని హిందుత్వంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. -
సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం పెద్ద డ్రామా..!
బెంగళూరు: మహారాష్ట్ర రాజకీయాల్లో తలెత్తిన అనూహ్య పరిణామాలపై బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ హడావిడిగా ప్రమాణం చేయడం వెనుక పెద్ద డ్రామా దాగి ఉందని, మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని రూ. 40వేల కోట్ల కేంద్ర నిధులను కాపాడి.. తిరిగి కేంద్రానికి అప్పగించేందుకే ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారంటూ విస్మయపరిచే వ్యాఖ్యలు గుప్పించారు. నిత్యం వివాదాల్లో ఉండే ఈ కర్ణాటక ఎంపీ.. శనివారం తన నియోజకవర్గం ఉత్తర కన్నడలోని యెల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర నిధులను సురక్షితంగా మళ్లీ కేంద్రానికి చేర్చడానికి ఫడ్నవిస్‌కు 15 గంటల సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. ‘మహారాష్ట్రలో మా పార్టీ వ్యక్తి కేవలం 80 గంటలు మాత్రమే సీఎంగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఫడ్నవిస్ రాజీనామా చేశారు. మేం ఎందుకీ డ్రామాను చేయాల్సి వచ్చింది? మాకు తెలియదా? మెజారిటీ లేదని మాకు తెలిసినా.. ఆయన ఎందుకు సీఎం అయ్యారు? ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలను అడుగుతున్నారు. దీనికి కారణం రూ. 40వేల కోట్లే. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఈ 40వేల కోట్లు అభివృద్ధి పనుల కోసం కాకుండా దుర్వినియోగమయ్యేవి. అందుకే పక్కా ప్లానింగ్‌తో ఏదైతే అదయిందని పెద్ద డ్రామాకు తెరతీశాం. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 15 గంటల్లో ఫడ్నవిస్ డబ్బులు తిరిగి సురక్షితంగా ఉండోచోటుకు పంపించారు. అవి కేంద్రానికి వెళ్లిపోయాయి. అవి ఉన్నచోటే ఉంటే తదుపరి సీఎం ఆ నిధులను ఏం చేసేవారో మనందరికీ తెలిసిందే’ అని అనంత్‌కుమార్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు ఇటు బీజేపీని, అటు ఫడ్నవిస్‌ను ఇరకాటంలోకి నెట్టేశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తెలిపారు. ‘అలాంటిదేమీ జరగలేదు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. రెండోసారి సీఎంగా ఉన్నప్పుడు నేను ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదు. నిజానికి ఇలా జరగడానికి ఆస్కారం లేదు. కావాలంటే ప్రభుత్వ ఆర్థిక విభాగం ఈ అంశంపై దర్యాప్తు చేపట్టవచ్చు’అని ఫడ్నవిస్ స్పష్టంచేశారు. -
రాహుల్ ఓ మూర్ఖుడు: హెగ్డే
సాక్షి, బెంగళూరు: రాహుల్ మూర్ఖుడు అంటూ కేంద్ర సహాయ మంత్రి, కర్ణాటకకు చెందిన అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్య కొత్త వివాదం రేపింది. ‘మోదీలైస్’ (మోదీ అబద్ధాలు) అనే కొత్తపదం ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీల్లోకి వచ్చిందంటూ రాహుల్ గురువారం ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్‌చేశారు. ఇంగ్లిష్‌లోనే మోదీలైస్ అనే పదం లేకున్నా ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఉందంటూ రాహుల్ నకిలీ ఫొటో పోస్ట్చేయడంపై హెగ్డే స్పందిస్తూ రాహుల్ గాంధీ మూర్ఖుడని, ప్రపంచంలో బుద్ధిహీనులుగా పేరొందిన వారిలో ఆయన ఒకరని వ్యాఖ్యానించారు. కాగా, మోదీలైస్ అనే పదం తమ డిక్షనరీల్లో దేంట్లోనూ లేదని ఆక్స్ఫర్డ్ స్పష్టంచేసింది. గాడ్సేను పొగుడుతూ హెగ్డే ట్వీట్ చేíసినా దానిని కొద్దిసేపటికే తొలగించారు. తన ఖాతా హ్యాకింగ్‌కు గురైందనీ, ఆ ట్వీట్ తాను చేయలేదని ఆయన చెప్పారు. రాజీవే పెద్ద హంతకుడు: బీజేపీ ఎంపీ గాడ్సేను ప్రస్తావిస్తూ కర్ణాటకకే చెందిన మరో బీజేపీ ఎంపీ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘గాడ్సే చంపింది ఒకరిని. ఉగ్రవాది అజ్మల్ కసబ్ చంపింది 72 మందిని. కానీ రాజీవ్ గాంధీ ఏకంగా 17 వేల మందిని హత్య చేశారు. ఈ ముగ్గురిలో ఎవరు అత్యంత క్రూరుడు?’ అని మంగళూరు ఎంపీ నళిన్ కుమార్ ట్వీట్ చేశారు. నెటిజన్లు, కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్వీట్‌ను తొలగించి, క్షమాపణలు చెబుతూ నళిన్ మరో ట్వీట్ చేశారు. గాంధీ.. పాక్ జాతిపిత: బీజేపీ ప్రతినిధి గాంధీజీ.. పాకిస్తాన్ జాతిపిత అంటూ బీజేపీ మీడియా వ్యవహారాల బాధ్యతలు చూసే అనిల్ సౌమిత్ర తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్‌పెట్టారు. భారత్‌లో గాంధీ వంటి వారు కోట్ల మంది పుట్టారని, వారిలో కొందరు దేశానికి ఉపయోగపడగా, మరికొందరు పనికిరానివారని సౌమిత్ర పేర్కొన్నారు. దీనిపై బీజేపీ తక్షణమే స్పందించింది. సౌమిత్రను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. -
కేంద్రమంత్రి భార్యకు డీఎన్ఏ పరీక్ష చేయాలి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు భార్య ఏ మతంవారని ప్రశ్నించిన కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డేపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ మండిపడ్డారు. హెగ్డే భార్య ఏ కులం వారో తెలుసుకోవటానికి డీఎన్ఏ పరీక్ష చేయించాలన్నారు. సోమవారం నగర కాంగ్రెస్ భవన్లో జిల్లా కాంగ్రెస్ ద్వారా ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొని మాట్లాడిన ఆయన హిందూ మహిళలను ముట్టుకొన్నవారి చేతులు కత్తిరించాలని అనంత్‌కుమార్ హెగ్డే చెప్పారని, ఆయన ఎంతమంది చేతులు కత్తిరించారో చెప్పాలని ప్రశ్నించారు. కేపీసీసీ ప్రచార సమితి రాష్ట్రాధ్యక్షుడు హెచ్.కే.పాటిల్ మాట్లాడుతూ గాంధీజీ ఫోటోను బొమ్మ తుపాకీతో కాల్చిన పూజా శకుల్పాండేను అరెస్టు చేయని పక్షంలో దేశ వ్యాప్తంగా పోరాటం చేపడతామన్నారు. కేపీసీసీ కార్యధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రె మాట్లాడుతూ గాంధీజీ బొమ్మను తుపాకీతో కాల్చినవారు దేశద్రోహులని మండిపడ్డారు. అనంత్‌కుమార్ హెగ్డేను తక్షణమే మంత్రి మండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆనంద్‌రావు సర్కిల్ వరకు పాదయాత్రగా తరలి గాంధీ విగ్రహానికి మాలార్పణం చేశారు. ఆ తరువాత మహిళా కాంగ్రెస్ నేతలు పూజా శకుల్పాండెపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. -
రాహుల్‌పై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూర్ : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి చెలరేగారు. ఈసారి ఆయన తనదైన శైలిలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్ కులగోత్రాలను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ తన మూలాలపై నిస్సిగ్గుగా అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి జన్మించిన కుమారుడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. రాహుల్‌ది హైబ్రిడ్ బ్రీడ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఇలా ఎక్కడా జరగదని కేవలం భారత్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రయోగశాలలోనే ఇలాంటివి జరుగుతాయని ఎద్దేవా చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రాహుల్ బృందానికి బుద్ధి చెబుతారని అన్నారు. కాగా హిందూ బాలికలపై ఇతర మతస్ధుల యువకులు చేయి వేస్తే హిందూ యువత వారి చేతులు తెగనరికి చరిత్ర సృష్టించేందుకు సిద్ధం కావాలని హెగ్డే ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావుపైనా హెగ్డే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గుండూరావు ముస్లిం మహిళ వెనుక దాక్కున్నారని ఇటీవల అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. -
చీర వెనుక దాక్కోవడం ఆపేయండి!
బెంగళూరు/న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే అనుచిత వ్యాఖ్యల ప్రహసనం కొనసాగుతోంది. హిందూ మహిళలపై చేయి వేసిన వారి చేతులు నరికేయాలంటూ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్య చేసిన హెగ్డే.. సోమవారం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూ రావుపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఒక ముస్లిం మహిళ వెనుక పరిగెత్తిన వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. ముస్లిం యువతిని దినేశ్ గుండూరావు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.(‘తాజ్‌మహల్.. ఒకప్పటి శివాలయం’) దీనిపై గుండూరావు భార్య తబస్సుమ్ స్పందిస్తూ.. తాను రాజకీయాల్లో లేని ఒక సాధారణ మహిళనని, ఒక వివాహిత మహిళ చీర వెనుక దాక్కొని రాజకీయాలు చేయడం ఆపేయాలని హెగ్డేకు సూచించారు. వ్యక్తిగత అంశాలను తెరపైకి తెచ్చే స్థాయికి దిగజారారంటూ హెగ్డేను గుండూరావు విమర్శించారు. మరోవైపు హెగ్డే ఆదివారం చేసిన వ్యాఖ్యలకు స్పందనగా.. హిందువు అయిన తన భార్యపై చేతులేసి దిగిన ఒక ఫోటోను మహారాష్ట్ర బీజేపీ నేత తెహసీన్ పూనావాలా ట్వీట్ చేశారు. ‘హిందూ మహిళపై చేయి వేసాను.. ఏం చేస్తావో చేసుకో’ అంటూ హెగ్డేకు సవాలు విసిరారు. -
కేంద్రమంత్రి అనంతకూమార్కు కడప ఉక్కు సెగ
-
‘పులిని తిరిగి అడవికి పంపే సమయం వచ్చేసింది’
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాలను కోతులు, నక్కలతో మోదీని పులితో పోల్చిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేకు కాంగ్రెస్ దీటుగా బదులిచ్చింది. హెగ్డే వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ స్పందిస్తూ క్రూర మృగంగా మారిన పులిని తిరిగి అడవికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.కర్ణాటకలోని కర్వార్‌లో శుక్రవారం ఓ సభలో పాల్గొన్న హెగ్డే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పులి లాంటి మోదీనే ఎంపిక చేసుకుంటారని కోతులు, నక్కలతో కూడిన విపక్షాలను కాదని వ్యాఖ్యానించారు. గతంలోనూ పలు సందర్భాల్లో అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఏడాది జనవరిలో దళితులను కుక్కలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించగా తాను వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తనను టార్గెట్ చేసిన కుహనా మేథావులను ఉద్దేశించి అలా అన్నానని వివరణ ఇచ్చారు. అంతకుముందు బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. -
మోదీ పులి.. విపక్షాలు కోతులు, నక్కలు!
సాక్షి, బెంగళూర్ : కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విపక్షాలను కోతులు, నక్కలతో ఆయన సరిపోల్చారు. కర్వార్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓ వైపు పులి, మరోవైపు కోతులు, నక్కలు బరిలో దిగుతాయని, ప్రజలు పులినే ఎంపిక చేసుకుంటారని వ్యాఖ్యానించారు. దేశం అభివృద్ధిలో వెనకబడటానికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాటు దేశాన్ని పాలించినా మనం ఇంకా ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చుంటున్నామని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనతో మీరు వెండి కుర్చీల్లో కూర్చుని ఉండాల్సిందని అన్నారు.అనంత్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో ఆయన దళితులను కుక్కలతో పోల్చడం పెనుదుమారం రేపింది. తాము వీధిన వెళుతుంటే కుక్కలు మొరిగితే పట్టించుకోమని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా మంత్రి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తాను దళితులను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, పలు అంశాలపై తన వైఖరిని ఎండగడుతున్న మేథావులను ఉద్దేశించే అలా అన్నానని చెప్పుకొచ్చారు. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ హెగ్డే వ్యాఖ్యలు కలకలం రేపాయి. బెంగళూర్, మైసూర్ ప్రజలకు కూడా కన్నడ ఎలా మాట్లాడాలో తెలీదని వ్యాఖ్యానించారు. ఇక 2017 డిసెంబర్లో రానున్న రోజుల్లో బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. -
కేంద్రమంత్రిపై హత్యా ప్రయత్నం..!!
హవేరి, కర్ణాటక : కేంద్ర నైపుణ్య శాఖ సహాయ మంత్రి అనంతకుమార్ హెగ్డే కాన్వాయ్‌కు మంగళవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనంతకుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై స్పందించిన ఆయన తనను చంపేందుకే ఈ దాడి జరిగిందని చెప్పారు. ఎవరో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, పోలీసులు ఈ విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరారు. ప్రమాదం జరిగిన తీరును గమనిస్తే ఇది కచ్చితంగా హత్యాప్రయత్నమేనని అర్థం అవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో ఆయన పోస్టు చేశారు. వేగంగా వచ్చిన ట్రక్కు తన కారును ఢీ కొట్టబోయిందని చెప్పారు. ట్రక్కు డ్రైవర్ ఫొటోను కూడా ట్విటర్లో జోడించిన ఆయన అతని నుంచి పూర్తి సమాచారం రాబట్టి దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని పోలీసులను కోరారు. I urge the police to take the case seriously in spilling the truth out from this guy named Nasir. There might be a bigger nexus behind this incident and am sure Police would expose all of them. pic.twitter.com/CXQuEZKMqD — Anantkumar Hegde (@AnantkumarH) 17 April 2018 -
కేంద్ర మంత్రిపై ప్రకాశ్ రాజ్ ఫైర్
సాక్షి, బెంగళూరు : బీజేపీ నేత అనంత్ కుమార్ హెగ్దే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దళితులను కించపరిచేలా ఆయన మాట్లాడారు. మొరుగుతున్న కుక్కలకు తాము భయపడబోమంటూ పరోక్షంగా తనను అడ్డుకున్న దళితులపై చిర్రుబుర్రులాడారు. రాజ్యాంగాన్ని మార్చేస్తామని, అందుకే తాము అధికారంలోకి వచ్చామని, లౌకిక పదాన్ని త్వరలోనే రాజ్యాంగంలో నుంచి తొలగించనున్నామని కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్దే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతోపాటు ఆందోళనలు బయల్దేరడంతో అని పార్లమెంటు సాక్షిగా క్షమాపణలు చెప్పారు. తాజాగా బెంగళూరు నుంచి బళ్లారి వచ్చిన ఆయన ఓ జాబ్ ఫెయిర్‌ను ప్రారంభించేందుకు కారులో వచ్చారు. ఈ సందర్భంగా కొంతమంది దళితులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. రాజ్యాంగంపై పరుష వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే, జాబ్ ఫెయిర్ ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ‘మేం మీకు సాయం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాము. ఏదేమైనా మేం మీతో ఉంటాము. మా ప్రజలను బతికించుకునేందుకు మేం ఏమైనా చేస్తాం. వీధి కుక్కల అరుపులకు, ఆందోళనలు, నిరసనలకు మేం తలవంచబోం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నటుడు ప్రకాశ్ రాజ్ వెంటనే గట్టి కౌంటర్ ఇచ్చారు. హెగ్దే ఎన్ని తప్పులు చేస్తారని, ఇక ఆయన ఆపాలని, దళితులను వీధికుక్కలంటూ అవమానిస్తారా? అని ట్విటర్లో ప్రశ్నించారు. బీజేపీ సీనియర్ నాయకత్వం వెంటనే హెగ్దేను దిగిపోవాలని ఆదేశించాలని, క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. Enough is enough.🙏🙏🙏..Serial offender...minister Ananthkumar Hegde at it again....he calls Dalits DOGs ..for protesting against his controversial constitution remark... supreme leaders of #bjp will you ask him to step down ...or do you endorse his abuse #justasking — Prakash Raj (@prakashraaj) January 20, 2018 -
ప్రకాష్ రాజ్ ఎక్కిన వేదికపై.. గోమూత్రం చల్లారు!
సాక్షి, బెంగళూర్ : నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని సిర్సిలో ప్రసంగించిన వేదికను ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది గంటలకే బీజేపీ యువమోర్చా కార్యకర్తలు గోమూత్రం చల్లి శుభ్రపరిచారు. మన రాజ్యాంగం..మన గర్వకారణం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ప్రకాష్ రాజ్ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్గే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ మాట్లాడటం బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రకాష్ రాజ్ ప్రసంగం ముగించి వెళ్లిన కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న బీజేపీ యువమోర్చా కార్యకర్తలు వేదికపై గోమూత్రం చల్లి శుభ్రపరిచారు. దీనిపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో స్పందిస్తూ తాను ఎక్కడికి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు ఇలాగే చేస్తారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేస్తామని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మంత్రి క్షమాపణలు చెప్పారు.