ప్రమాదానికి గురైన కాన్వాయ్
హవేరి, కర్ణాటక : కేంద్ర నైపుణ్య శాఖ సహాయ మంత్రి అనంతకుమార్ హెగ్డే కాన్వాయ్‌కు మంగళవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనంతకుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై స్పందించిన ఆయన తనను చంపేందుకే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ఎవరో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, పోలీసులు ఈ విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరారు. ప్రమాదం జరిగిన తీరును గమనిస్తే ఇది కచ్చితంగా హత్యాప్రయత్నమేనని అర్థం అవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో ఆయన పోస్టు చేశారు. వేగంగా వచ్చిన ట్రక్కు తన కారును ఢీ కొట్టబోయిందని చెప్పారు.
ట్రక్కు డ్రైవర్ ఫొటోను కూడా ట్విటర్‌లో జోడించిన ఆయన అతని నుంచి పూర్తి సమాచారం రాబట్టి దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని పోలీసులను కోరారు.
I urge the police to take the case seriously in spilling the truth out from this guy named Nasir. There might be a bigger nexus behind this incident and am sure Police would expose all of them. pic.twitter.com/CXQuEZKMqD
— Anantkumar Hegde (@AnantkumarH) 17 April 2018
Comments
Please login to add a commentAdd a comment