సాక్షి, బెంగళూర్ : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి చెలరేగారు. ఈసారి ఆయన తనదైన శైలిలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్ కులగోత్రాలను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ తన మూలాలపై నిస్సిగ్గుగా అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.
ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి జన్మించిన కుమారుడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. రాహుల్‌ది హైబ్రిడ్ బ్రీడ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఇలా ఎక్కడా జరగదని కేవలం భారత్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రయోగశాలలోనే ఇలాంటివి జరుగుతాయని ఎద్దేవా చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రాహుల్ బృందానికి బుద్ధి చెబుతారని అన్నారు.
కాగా హిందూ బాలికలపై ఇతర మతస్ధుల యువకులు చేయి వేస్తే హిందూ యువత వారి చేతులు తెగనరికి చరిత్ర సృష్టించేందుకు సిద్ధం కావాలని హెగ్డే ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావుపైనా హెగ్డే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గుండూరావు ముస్లిం మహిళ వెనుక దాక్కున్నారని ఇటీవల అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
Comments
Please login to add a commentAdd a comment