
దినేశ్ గుండూరావు
న్యూఢిల్లీ: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి(కేపీసీసీ)గా దినేశ్ గుండూరావు(48) నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ జి.పరమేశ్వర సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగుతున్నందున ఈ నియామకం చేపట్టినట్లు ఏఐసీసీ పేర్కొంది. బెంగళూరులోని గాంధీనగర్ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికైన గుండూరావు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
ఆయన గత కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేగా ఈశ్వర్ ఖంద్రేను కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో యువ రక్తాన్ని నింపాలన్న రాహుల్ ఆలోచన మేరకే ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment