ముంబై: భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొంతకాలంగా వ్యూహాత్మక పెట్టుబడులతో ముందుకు వెళుతోంది. కొత్త కొత్త రంగంలో పెట్టుబడులు పెడుతూ రిలయన్స్ సంస్థ ప్రస్తుతం దేశంలో దూసుకెళ్తుంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కొత్త కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం అవుతుంది. ఆల్టిగ్రీన్ ప్రొపల్షన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో రూ.50.16 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ తెలిపింది.
బెంగళూరు కేంద్రంగా పనిచేసే ప్రొపల్షన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలకు లాస్ట్ మైలేజ్ రవాణాకు సంబంధించి సేవలను అందిస్తూ ఉంటుంది. 2/3/4 చక్రాల వాహనాలకు తమ సేవలను అందిస్తుంది. 100 శాతం తన సొంత టెక్నాలజీతో సదరు సంస్థ ఎలక్ట్రిక్ ఆటోను తయారు చేసింది. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ 2020-21 ఆర్థిక సంవస్సరంలో రూ.104 కోట్ల టర్నోవర్ చేసింది. ఈ పెట్టుబడుల ప్రక్రియ మార్చి 2022 నాటికి పూర్తవుతుందని తెలిపింది. "కొత్త శక్తి, కొత్త మొబిలిటీ పర్యావరణ వ్యవస్థలలో సృజనాత్మక కంపెనీలతో సహకరించాలనే మా కంపెనీ వ్యూహాత్మక ఉద్దేశ్యంలో ఈ పెట్టుబడి భాగం" అని ఆర్ఐఎల్ తెలిపింది.
(చదవండి: కారు తయారీ దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్..!)
Comments
Please login to add a commentAdd a comment