న్యూఢిల్లీ: ద్విచక్రవాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తోంది. వచ్చే నెలలో విడా బ్రాండ్ కింద తొలి మోడల్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. రవాణా రంగంలో కొత్త శకాన్ని ఆవిష్కరించేలా అక్టోబర్ 7న రాజస్థాన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.
( క్లిక్: మాకూ పీఎల్‌ఐ స్కీమ్ ఇవ్వండి : టోయ్స్ పరిశ్రమ)
తద్వారా పరోక్షంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎంట్రీని వెల్లడించింది. జైపూర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా డీలర్లు, ఇన్వెస్టర్లు, అంతర్జాతీయ పంపిణీదారులను ఆహ్వనించింది. జైపూర్‌లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో ఈ వాహనాన్ని రూపొందించినట్లు, విడా బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న ప్లాంటులో వీటి తయారీ చేపట్టవచ్చని పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: Gold Price: ఫెస్టివ్ సీజన్‌లో గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment