మనం వాడే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎన్ని రోజుల వరకు వస్తోందంటే..ఏం చెప్తాం..? సుమారు ఒక రోజు లేదా మహా అయితే రెండు రోజులు అది కూడా మనం వాడే వాడకాన్ని బట్టి స్మార్ట్‌ఫోన్ సుదీర్ఘంగా రెండు రోజులపాటు స్టాండ్ బై ఉంటుంది. బ్యాటరీ సమస్యలనుంచి తప్పించుకోవడం కోసం మనలో చాలా మంది అదనంగా పవర్‌బ్యాంకులను కూడా వాడుతుంటాం. కాగా స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కష్టాలకు చెక్ పెడుతూ...ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు ఐబీఎమ్, శాంసంగ్ సుమారు వారం రోజులపాటు బ్యాటరీ అందించే ఆవిష్కరణకు సిద్ధమైనాయి. స్మార్ట్‌ఫోన్లలో వాడే సెమీకండక్టర్ల డిజైన్లను మార్చడం ద్వారా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ పొందవచ్చునని ఇరు కంపెనీలు వెల్లడించాయి.
వారం రోజులపాటు.. విత్ అవుట్ ఛార్జింగ్..!
ఐబీఎమ్, శాంసంగ్ కంపెనీలు దాదాపు వారం రోజులపాటు బ్యాటరీను అందించే సెమీకండక్టర్ డిజైన్‌పై సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఈ సెమికండక్టర్ విషయంలో పురోగతిని సాధించినట్లు కంపెనీలు వెల్లడించాయి. సెమీకండక్టర్ ట్రాన్సిస్టర్‌లను నిలువుగా అమర్చడంతో సిలికాన్ బోర్డులపై ఎక్కువ స్థలాన్ని పొందవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి.
శాంసంగ్-ఐబీఎమ్ సంయుక్తంగా రూపొందించిన చిప్
సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో వాడే ఫిన్‌ఫెట్ ట్రాన్సిస్టర్ (ఫిన్ ఫీల్డ్-ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్)తో పోలిస్తే ఐబీఎమ్, శాంసంగ్ సంయుక్తంగా రూపొందించిన కొత్త డిజైన్ వర్టికల్ ట్రాన్స్‌పోర్ట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్‌లు(VTFET) సిలికాన్ బోర్డులపై అధిక సాంద్రతను కల్గి ఉండనున్నాయి. ఇలా చేయడంతో బ్యాటరీ శక్తి వినియోగంలో 85 శాతం మేర తగ్గే అవకాశం ఉన్నట్లు ఐబీఎమ్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ట్రాన్సిస్టర్ స్విచింగ్ వేగాన్ని మెరుగుపరచడంలో, విద్యుత్ అవసరాలను తగ్గించడంలో సహాయపడనుందని పేర్కొంది.
చదవండి: వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..!
Comments
Please login to add a commentAdd a comment