Engineering Entrance
-
ఎంసెట్‌లో ముందుగా ఏ పరీక్ష?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో ముందుగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించాలా? ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు పరీక్షను నిర్వహించాలా? అన్న విషయంలో ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ చర్యలు చేపట్టింది. మరోవైపు రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలను జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. సాధారణంగా అందులో ముందు 3 రోజుల పాటు (5, 6, 7 తేదీల్లో) ఆన్లైన్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ఆరు సెషన్లలో (రోజుకు రెండు సెషన్లు) నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైతే 8న కూడా ఒక సెషన్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను 8, 9 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు, ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒక రోజు గడువే ఉంటోంది. దీంతో మ్యాథమెటిక్స్ విద్యార్థుల వెసులుబాటు కోసం ముందుగా ఇంజనీరింగ్ ఎంసెట్ కాకుండా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం ఎంసెట్‌ను నిర్వహించాలనే ఆలోచనలు చేస్తోంది ఉన్నత విద్యామండలి. అయితే నీట్ తేదీలను ప్రకటించాక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అప్పుడే అగ్రికల్చర్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? అన్న విషయంలో ఎంసెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. జూన్‌లో పాలీసెట్! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్‌ను ఈసారి జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా పదో తరగతి పరీక్షలు పూర్తికాగానే ఏప్రిల్ చివరలో పాలీసెట్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) నిర్వహిస్తోంది. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మే 17 నుంచి 26వ తేదీ వరకు ఉండటంతో పాలీసెట్‌ను జూన్‌లో నిర్వహించేలా ఎస్బీటీఈటీ కసరత్తు చేస్తోంది. చదవండి: తెలంగాణ ఎంసెట్ 2021 షెడ్యూల్ విడుదల సింగరేణిలో 2087 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్... -
ఒకే ఇంజనీరింగ్ ఎంట్రన్స్!
ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణ యోచనలో కేంద్రం ప్రస్తుతం బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు సగటున పది ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్నారు. వీటిలో జేఈఈ, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఎంట్రన్స్‌లు, ప్రైవేటు యూనివర్సిటీలు సొంతంగా నిర్వహిస్తున్న పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో దరఖాస్తు దశ నుంచి ప్రిపరేషన్ వరకు విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటికి స్వస్తి పలకాలనే ఆలోచనతో 2018 నుంచి జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్లు సమాచారం. పరీక్ష నిర్వహణ, పర్యవేక్షణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలో సెంటర్ ఫర్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ స్టడీస్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జేఈఈ మెయిన్‌కు స్వస్తి? ప్రతిపాదిత జాతీయస్థాయి ఉమ్మడి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష కార్యరూపం దాల్చితే.. జేఈఈ మెయిన్ విధానానికి స్వస్తి పలికేందుకు అవకాశముంది. అయితే ఐఐటీల్లో ప్రవేశాలకు మాత్రం విద్యార్థులు ఇప్పటి (జేఈఈ–అడ్వాన్స్డ్) మాదిరిగానే మరో ప్రత్యేక ఎంట్రన్స్‌కు హాజరవ్వాల్సిందే. దీనిపై విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. ఇలాచేస్తే ఉమ్మడి పరీక్ష వల్ల ప్రత్యేక ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. రెండు రకాలుగా ర్యాంకులు ఉమ్మడి ఇంజనీరింగ్ పరీక్షను నిర్వహించడం ద్వారా ర్యాంకులను రెండు రకాలుగా (ఆలిండియా ర్యాంకు, లోకల్ ర్యాంకు) ఇచ్చే అవకాశం ఉంది. ఆలిండియా ర్యాంకు ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు చేపట్టే అవకాశం ఉంది. లోకల్ ర్యాంకును రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని కేటాయించే అవకాశముంది. దీని ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌లు నిర్వహించే అవకాశముంది. సిలబస్‌ల విషయంలో గందరగోళం జాతీయ స్థాయి ఉమ్మడి పరీక్ష ఆలోచన నేపథ్యంలో వినిపిస్తున్న మరో ప్రతికూల వ్యాఖ్య.. సిలబస్‌ల విషయంలో గందరగోళం నెలకొంటుందనేది. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ సిలబస్‌ను సీబీఎస్ఈకి సరితూగే విధంగా మార్చినప్పటికీ.. వివిధ రాష్ట్రాల్లో సిలబస్ సీబీఎస్ఈ స్థాయికి అనుగుణంగా లేదని ఆ రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు కనిపిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ కోర్సులకు నీట్‌ను ప్రతిపాదించినప్పుడు ఎదురైన అనుభవాలే మళ్లీ ఎదురవుతాయని అంటున్నారు. పరీక్ష విధానంపైనా ఆందోళన జేఈఈ మెయిన్‌కు బదులు ఉమ్మడి ఇంజనీరింగ్ పరీక్ష ఉంటుందనే సంకేతాల నేపథ్యంలో పరీక్ష విధానంపైనా సాధారణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒక నిర్దిష్ట విధానంలో జరుగుతున్న రాష్ట్రాల స్థాయిలోని సెట్లు, వాటి పరీక్ష శైలికి అలవాటు పడిన విద్యార్థులు జేఈఈ మెయిన్ తరహా విధానాన్ని అందిపుచ్చుకోవడం కష్టమవుతుందని, వాస్తవానికి జేఈఈ కోసం రెండు, మూడేళ్లు కష్టపడిన విద్యార్థుల్లో సైతం సక్సెస్ రేట్ 25 నుంచి 30 శాతం మధ్యలోనే ఉంటోందని విద్యావేత్తలు అంటున్నారు. 2019 నుంచి అమలు చేయాలి కొందరు విద్యావేత్తలు ఉమ్మడి ప్రవేశ పరీక్షను స్వాగతిస్తున్నప్పటికీ, దాన్ని 2018 నుంచే అమలు చేయాలనే నిర్ణయం విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తుందని అంటున్నారు. పరీక్షను 2019 నుంచి నిర్వహించాలని సూచిస్తున్నారు. ఈలోగా పరీక్ష విధానానికి అనుగుణంగా 2017–19లో ఇంటర్మీడియెట్ బోర్డ్‌ల సిలబస్‌లో తగిన మార్పులు చేయాలని అంటున్నారు. దీనివల్ల విద్యార్థులకు కొత్త పరీక్షకు సంబంధించిన ఆందోళన నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. 2013లోనే ప్రయత్నాలు వాస్తవానికి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణకు 2012లో అప్పటి హెచ్ఆర్డీ వర్గాలు యత్నించాయి. ఐసీట్ పేరుతో ఉమ్మడి ప్రవేశ పరీక్షను ప్రతిపాదించి, 2013 నుంచి నిర్వహించాలని నిర్ణయించాయి. కానీ, దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ ప్రతిపాదన మరుగునపడింది. ఏఐసీటీఈ పనితీరు, సాంకేతిక విద్యలో నాణ్యతకు సంబంధించి సమీక్షకు కేంద్ర ప్రభుత్వం 2014లో కమిటీని నియమించింది. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ ఎం.కె.కా అధ్యక్షులుగా ఉన్న ఈ కమిటీ 2015లో నివేదికను అందజేసింది. ఇందులోనే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆవశ్యకతను బలంగా వినిపించింది. అమెరికాలోని స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తరహాలో ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తే భవిష్యత్తులో నాణ్యమైన ఇంజనీర్లు రూపొందుతారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగానే హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఉమ్మడి పరీక్షపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జాతీయ స్థాయి ఉమ్మడి ప్రవేశపరీక్షను నిర్వహించడం ఖాయమైతే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో ఇప్పటికే నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది పోటీపడుతున్నారు. వీరంతా ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులే. కాబట్టి కొత్త ఉమ్మడి పరీక్షపై ఆందోళన అనవసరం. – ప్రొఫెసర్ ఎన్.యాదయ్య, రిజిస్ట్రార్, జేఎన్టీయూ–హెచ్. జాతీయ స్థాయి ‘సెట్’ను ప్రవేశపెట్టే ముందు, దాన్ని అంది పుచ్చుకునేందుకు వీలుగా కొంత సమయం ఇస్తే బాగుంటుంది. ఈ పరీక్ష ద్వారా ప్రైవేటు యూనివర్సిటీల వాణిజ్య దృక్పథానికి ఫుల్స్టాప్ పడుతుందనేది వాస్తవం. అయితే అవి ఫీజులను పెంచే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలతో సంప్రదింపులు చేశాక, తుది నిర్ణయం తీసుకోవడం సముచితంగా ఉంటుంది. – డా. డీఎన్ రెడ్డి, డైరెక్టర్, ఈఎస్సీఐ–హైదరాబాద్. -
నేటి నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
పోచమ్మమైదాన్ : ఎట్టకేలకు ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన కు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఎంపీసీ పాస్ అయి ఎంసెట్‌లో అర్హత సాధించిన వారికి ఇంజనీరింగ్‌లో ప్రవేశం కోసం గురువారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. అధికారులు జిల్లా కేంద్రంలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాలలో ఈ నెల 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 15, 19 తేదీలలో సెలవు ఉంటుంది. ఎస్టీ విద్యార్థులు అన్ని ర్యాంక్‌ల వారు వ రంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హె ల్ప్‌లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల పరిశీలనకు జరు కా వాలి. సర్టిఫికెట్ల పరిశీలన కోసం మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వెబ్ అప్షన్కు తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఈ సర్టిఫికెట్లు తీసుకురండి.... పదవ తరగతి, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు కులం, ఆదాయం సర్టిఫికెట్లు, ర్యాంక్ కార్డు, హాల్‌టికెట్, టీసీ బీసీ, ఓసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.300 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఎన్సీసీ, స్పోర్ట్స్, ఫిజికల్ హ్యాండీక్యాప్, ఆంగ్లో ఇండియన్స్ విద్యార్థులు హైదారాబాద్‌లోని సాంకేతిక విద్యా భవన్ జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. -
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లకు.. వన్‌టైమ్ పాస్వర్డ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు సంబంధించి మోసాలను అరికట్టేందుకు వన్‌టైమ్ పాస్వర్డ్ విధానాన్ని అమలు చేయాలని ఇంజనీరింగ్ ప్రవేశాల ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. వెబ్సైట్లో ఆప్షన్లు ఇచ్చే పేజీలోకి వెళ్లి విద్యార్థి తన వివరాలను నమోదు చేయగానే ఆ విద్యార్థి మొబైల్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేయనుంది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారిక నిర్ణయం తీసుకున్నారు. ఈ వన్‌టైమ్ పాస్వర్డ్ 15 నిమిషాల పాటు పనిచేసేలా చర్యలు చేపట్టాలని.. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)తో రూపొందించాలని నిర్ణయించారు. దీంతోపాటు హెల్ప్‌లైన్ కేంద్రాల సంఖ్యను కూడా పెంచనున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్ల విధానం వల్ల ఇంటర్నెట్ కేంద్రాల వారు విద్యార్థి స్క్రాచ్ కార్డులోని పాస్‌వర్డ్‌ను దొంగిలించడం.. విద్యార్థులకు తెలియకుండానే, వారు ఇవ్వకపోయినా కొన్ని కాలేజీల్లో ఆప్షన్లు ఇవ్వడం వంటి మోసాల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై ఉన్నత స్థాయి కమిటీ పలు ప్రతిపాదనలను పరిశీలించింది. ఇంటర్నెట్ కేంద్రాలు, ఇళ్లలోంచి కాకుండా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో మాత్రమే ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలనే ఆలోచనచేసింది. కానీ, అందులోని ఇబ్బందుల నేపథ్యంలో వన్‌టైమ్ పాస్వర్డ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదీ వన్ టైం పాస్వర్డ్ విధానం: విద్యార్థి దరఖాస్తు చేసుకున్నప్పుడే మొబైల్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆప్షన్లు ఇచ్చే సమయంలో ఆ మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ సహాయంతో వెబ్సైట్లో ఆప్షన్ల పేజీలోకి వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ పాస్వర్డ్ 15 నిమిషాల పాటు మాత్రమే పనిచేస్తుంది. ఆ సమయంలోగా విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవాలి. నిర్ణీత సమయం పూర్తికాగానే విద్యార్థి ఇచ్చిన ఆప్షన్లు వాటంతట అవే సేవ్ అయి, విద్యార్థి లాగ్ అవుట్ అవుతాడు. మళ్లీ లాగిన్ అయితే మరో పాస్వర్డ్ వస్తుంది. దానితో మళ్లీ పేజీలోకి వెళ్లి మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు, ఇచ్చిన ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు, దళారీలు మోసం చేసినా, ప్రలోభాలకు గురిచేసినా... ఆ తరువాత విద్యార్థి మళ్లీ లాగిన్ అయి మరో పాస్‌వర్డ్‌తో మళ్లీ మార్పులు చేసుకోవచ్చు. 14 రోజుల పాటు ఈ ఆప్షన్ల ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. చివరి రోజున విద్యార్థి మరోసారి ఆప్షన్లను సరిచూసుకొని మార్పు చేసుకొని సబ్మిట్ చేయవచ్చు.