![Shaktikanta Das Led MPC Starts 3 Day Deliberations On Policy review - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/4/rbi.jpg.webp?itok=Nk5wp5C5)
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశం దేశీయ, అంతర్జాతీయ ఆరి్థక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, వ్యవస్థలో డిమాండ్ వంటి కీలక అంశాలపై చర్చించనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోసహా కీలక నిర్ణయాలను గురువారం ఆర్‌బీఐ వెలువరిస్తుంది.
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు కూ2లో ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోవడం, ఆరి్థకవ్యవస్థ మందగమనం తీవ్రతను స్పష్టంచేస్తూ పలు గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని వృద్ధికి ఊపందించడమే లక్ష్యంగా ఆర్‌బీఐ రెపోరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గడచిన ఐదు సమావేశాల్లో ఆర్‌బీఐ రెపోరేటు 135 బేసిస్ పాయింట్లు (1.35 శాతం) తగ్గింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment