లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు పైబడిన ప్రభుత్వ ఉద్యోగులను బలవంతగా ఇంటికి పంపించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా 50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగులను వదిలించుకోవడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఆర్డర్‌ను శుక్రవారం విడుదల చేసింది. 2018 మార్చి 31 నాటికి 50 సంవత్సరాల వయస్సు దాటిన ప్రభుత్వ ఉద్యోగులకు(కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి) స్క్రీనింగ్ టెస్ట్ జరిపి ఆ వివరాలను జూలై 31లోపు సమర్పించాల్సిందిగా అన్ని శాఖల విభాగాధిపతులకు ఆదేశాలు జారీచేసింది.
దీంతో యూపీలో వివిధ శాఖలలో పనిచేస్తోన్న 16లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 4 లక్షల మంది స్ర్కీనింగ్ టెస్ట్ ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఉద్యోగి సమయపాలన, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర అంశాల ప్రాతిపాదికన రేటింగ్‌లు ఇస్తారు. ఎవరైతే తక్కువ రేటింగ్‌లు పొందుతారో వారిని రిటైర్ చేయాల్సిన జాబితాలో చేర్చనున్నారు. ఆ జాబితాలోని ఉద్యోగులకు ముందస్తు రిటైర్‌మెంట్ ఇస్తారు. ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఉద్యోగులను హింసించడమేనని వారు మండిపడుతున్నారు. కాగా సర్వీస్ హ్యాండ్‌బుక్‌లో మాత్రం 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు మూడు నెలల ముందు నోటీసు ఇచ్చి బలవంతంగా విధుల నుంచి తొలగించవచ్చనే నిబంధన ఉంది.
Comments
Please login to add a commentAdd a comment