compulsory retirement
-
సంచలనం : 12 మంది సీనియర్ అధికారులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం అధికార దుర్వినియోగం, అవినీతి, దోపిడీ, అక్రమ ఆస్తులు, విధుల్లో నిర్లక్ష్యం, తోటి మహిళా ఉద్యోగులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 12మంది సీనియర్ అధకారులపై కొరటా ఝుళిపించింది. నిర్బంద పదవీ విరమణ ఆదేశించింది. వీరంతా చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులు కావడం గమనార్హం. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం బాధ్యతల నుంచి తొలగిస్తూ కేంద్ర ఆర్థికశాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసినట్టుగా పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. వీరిలో అశోక్ అగర్వాల్ (ఐఆర్ఎస్ 1985), జాయింట్ కమిషనర్ ఆదాయపు పన్ను (సిట్), ఎస్.కె. శ్రీవాత్సవ (ఐఆర్ఎస్, 1989), కమిషనర్ (అప్పీల్), నోయిడా, హోమి రాజ్వంశ్ (ఐఆర్ఎస్, 1985), బిబి రాజేంద్రప్రసాద్, అజయ్ కుమార్ సింగ్ (సిట్), బి.అరుళప్ప (సిట్)తో పాటు అలోక్ కుమార్ మిత్రా, చందర్ సైని భారతి, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, రామ్ కుమార్ భార్గవ ఉన్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోపణలపై నోయిడా కమిషనర్ ఎస్.కే శ్రీవాస్తవకు ఉద్వాసన పలకడం సంచలనంగా మారింది. వీరితోపాటు బలవంతపు వసూళ్ల ఆరోపణలపై అశోక్ కుమార్ అగర్వాల్, అధికార దుర్వినియోగం, అక్రమార్జన కింద హోమీరాజ్ వంశ్, అవినీతి ఆరోపణలపై అజయ్ కుమార్, చందర్, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, భార్గవ బాధ్యతలనుంచి తప్పించి బలవంతపు రిటైర్మెంట్కు ఆదేశాలిచ్చినట్టు సమాచారం. -
50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు స్క్రీనింగ్!
లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు పైబడిన ప్రభుత్వ ఉద్యోగులను బలవంతగా ఇంటికి పంపించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా 50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగులను వదిలించుకోవడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఆర్డర్‌ను శుక్రవారం విడుదల చేసింది. 2018 మార్చి 31 నాటికి 50 సంవత్సరాల వయస్సు దాటిన ప్రభుత్వ ఉద్యోగులకు(కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి) స్క్రీనింగ్ టెస్ట్ జరిపి ఆ వివరాలను జూలై 31లోపు సమర్పించాల్సిందిగా అన్ని శాఖల విభాగాధిపతులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో యూపీలో వివిధ శాఖలలో పనిచేస్తోన్న 16లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 4 లక్షల మంది స్ర్కీనింగ్ టెస్ట్ ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఉద్యోగి సమయపాలన, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర అంశాల ప్రాతిపాదికన రేటింగ్‌లు ఇస్తారు. ఎవరైతే తక్కువ రేటింగ్‌లు పొందుతారో వారిని రిటైర్ చేయాల్సిన జాబితాలో చేర్చనున్నారు. ఆ జాబితాలోని ఉద్యోగులకు ముందస్తు రిటైర్మెంట్ ఇస్తారు. ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఉద్యోగులను హింసించడమేనని వారు మండిపడుతున్నారు. కాగా సర్వీస్ హ్యాండ్‌బుక్‌లో మాత్రం 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు మూడు నెలల ముందు నోటీసు ఇచ్చి బలవంతంగా విధుల నుంచి తొలగించవచ్చనే నిబంధన ఉంది. -
పనిచేయడం లేదని.. ఐపీఎస్‌లను పీకిపారేశారు!
ప్రభుత్వోద్యోగం వచ్చిందంటే చాలు.. హాయిగా కాలం గడిపేయొచ్చని, రిటైరైన తర్వాత కూడా ఎంచక్కా పింఛను తీసుకోవచ్చని, పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదని అనుకునే రోజులకు ఇక కాలం చెల్లింది. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఇలాంటి వాళ్లను లొంగదీస్తున్నారు. ఇప్పటికి 60 మంది అధికారులను డిస్మిస్ చేయడం, తప్పనిసరిగా రిటైర్ చేయడం లాంటి చర్యలు జరిగాయి. తాజాగా ఆ జాబితాలోకి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా చేరారు. 1992 బ్యాచ్‌కి చెందిన ఛత్తీస్‌గఢ్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజ్‌కుమార్ దేవన్గణ్, 1998 బ్యాచ్‌కి చెందిన అరుణాచల్ ప్రదేశ్ - గోవా - మిజోరాం కేడర్ ఆఫీసర్ షీల్ చౌహాన్ ఇద్దరినీ ముందుగానే రిటైర్ చేయించి ఇంటికి పంపేశారు. ప్రభుత్వ సర్వీసులో చేరి 15-25 ఏళ్ల వరకు పూర్తిచేసుకున్నవాళ్ల పనితీరును సమీక్షించిన తర్వాత ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పనితీరు ఒక మాదిరి కంటే తక్కువగా ఉంటే మాత్రం కఠిన చర్యలు తప్పడం లేదు. ఈ ఇద్దరు అధికారుల మీద ఇప్పటికే ఫిర్యాదులు కూడా ఉన్నాయని, అందుకే వాళ్లకు మూడు నెలల జీతం ఇచ్చి తప్పనిసరి ముందస్తు రిటైర్మెంట్ ఇచ్చారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. వాస్తవానికి ప్రభుత్వాధికారులకు సంబంధించి ఇలాంటి నిబంధన ఎప్పటినుంచో ఉంది. కానీ, దీన్ని ఎవరూ సరిగా అమలుచేయలేదు. అసమర్థులు, అవినీతిపరులైన అధికారులు 'ప్రజాప్రయోజనాల రీత్యా తప్పనిసరిగా రిటైర్ కావాలి' అని ఈ నిబంధన చెబుతోంది. 2015 సంవత్సరంలో నరేంద్రమోదీ ప్రభుత్వం దీన్ని వెలికితీసి, 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఉన్నతాధికారుల పనితీరు తప్పనిసరిగా పరిశీలించాలని, పనిచేయని వాళ్లకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖలలో తెల్ల ఏనుగుల్లా పనిచేయకుండా కూర్చుంటున్న వాళ్లను ఇంటికి పంపడానికి బీజేపీ ప్రభుత్వం ఈ నిబంధనను బాగానే ఉపయోగించుకుంటోందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. -
నువ్వు మాకొద్దు.. ముందే దిగిపో..
బెంగళూరు: ఆయనొక ఐఏఎస్ అధికారి. విధి నిర్వహణలో కచ్చితంగా పనిచేస్తారు. తన ముందు జరిగే అవినీతిని ఏమాత్రం సహించడు. ఫలితంగా అతడిపై ఎన్నో అభాండాలు, ఎందరో దుష్ప్రచారం. సహ ఉద్యోగుల అసహనం. కచ్చితంగా నిలదీసే తత్వం ఉన్న ఆయన ఓ ప్రజావేగు కూడా. ఆయా శాఖల్లో ఉన్న అవినీతిని ప్రశ్నించినందుకుగాను.. మరో మూడు రోజుల్లో పదవీ విరమణ పొందాల్సి ఉండగా వెంటనే పదవీవిరమణ పొందాలని ఆదేశాలిచ్చి ఉద్యోగం దిగిపోయేలా చేసింది కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటకలో ప్రిన్సిపల్ సెక్రటరీ లెవల్ అధికారిగా పనిచేస్తున్న ఎంఎన్ వినయ్ కుమార్ 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా నిబద్ధతగా పనిచేశారు. సీనియర్ అధికారుల విషయంలో కూడా ముక్కుసూటిగా వ్యవహరించాడు. దీంతో వారు ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించి పలు శాఖలకు బదిలీ చేయించారు. చివరికి ఆయనపై అసత్య ఫిర్యాదులు చేసి ముందస్తుగా అత్యవసర పదవీ విరమణ పొందేలా ఒత్తిడి చేసి తొలగించారు. ఈ సందర్భంగా ఆయన పదవీ విరమణ అనంతరం పొందే లబ్ధిని కూడా వదులుకున్నారు.