బెంగళూరు: ఆయనొక ఐఏఎస్ అధికారి. విధి నిర్వహణలో కచ్చితంగా పనిచేస్తారు. తన ముందు జరిగే అవినీతిని ఏమాత్రం సహించడు. ఫలితంగా అతడిపై ఎన్నో అభాండాలు, ఎందరో దుష్ప్రచారం. సహ ఉద్యోగుల అసహనం. కచ్చితంగా నిలదీసే తత్వం ఉన్న ఆయన ఓ ప్రజావేగు కూడా. ఆయా శాఖల్లో ఉన్న అవినీతిని ప్రశ్నించినందుకుగాను.. మరో మూడు రోజుల్లో పదవీ విరమణ పొందాల్సి ఉండగా వెంటనే పదవీవిరమణ పొందాలని ఆదేశాలిచ్చి ఉద్యోగం దిగిపోయేలా చేసింది కర్ణాటక ప్రభుత్వం.
కర్ణాటకలో ప్రిన్సిపల్ సెక్రటరీ లెవల్ అధికారిగా పనిచేస్తున్న ఎంఎన్ వినయ్ కుమార్ 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా నిబద్ధతగా పనిచేశారు. సీనియర్ అధికారుల విషయంలో కూడా ముక్కుసూటిగా వ్యవహరించాడు. దీంతో వారు ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించి పలు శాఖలకు బదిలీ చేయించారు. చివరికి ఆయనపై అసత్య ఫిర్యాదులు చేసి ముందస్తుగా అత్యవసర పదవీ విరమణ పొందేలా ఒత్తిడి చేసి తొలగించారు. ఈ సందర్భంగా ఆయన పదవీ విరమణ అనంతరం పొందే లబ్ధిని కూడా వదులుకున్నారు.
నువ్వు మాకొద్దు.. ముందే దిగిపో..
Published Sun, May 3 2015 11:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM
Advertisement
Advertisement