నాకు ఇప్పుడు 7వ నెల. జీటీటీ టెస్ట్ రాశారు. మా కుటుంబంలో ఎవరికీ షుగర్ లేకపోయినా నేను ఆ టెస్ట్ చేయించుకోవాలా? రిజల్ట్ ఎలా వస్తుందోనని భయపడి టెస్ట్ చేయించుకోలేదు. ఈ టెస్ట్ అందరికీ చేస్తారా?
– షమా ఫిర్‌దౌజ్, బనగానపల్లె.
గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది ఒక రక్తపరీక్ష. 7వ నెల మొదట్లో గర్భిణీలందరికీ రొటీన్‌గా చేసే పరీక్ష. ఇది జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్‌ని కనిపెడుతుంది. మీ శరీరం సాధారణ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను మెయిన్‌టేన్ చేస్తుందా లేదా అనేది ఈ పరీక్ష ద్వారా చెక్ చేస్తారు. అందుకే జీటీటీ టెస్ట్‌ని గర్భిణీలందరికీ చేస్తారు.
ముఖ్యంగా 85 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారికి, తొలి చూలులో బిడ్డ నాలుగున్నర కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువుతో పుట్టినా.. ముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా, కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా.. ఈ టెస్ట్ చేయాలి. జీటీటీలో రిజల్ట్ నార్మల్ వస్తే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రిస్క్ లేదని అర్థం. రిజల్ట్ అబ్‌నార్మల్ వస్తే డయాబెటీస్ స్పెషలిస్ట్‌ని సంప్రదించాలి. తీసుకోవాల్సిన డైట్, మానిటరింగ్‌ను వివరిస్తారు. ఈ మధ్యకాలంలో 2–12 శాతం వరకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కనిపిస్తోంది.
-డా.భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: ఫుడ్ అలెర్జీ ఎందుకొస్తుందో తెలుసా?.. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి)
Comments
Please login to add a commentAdd a comment