Glucose
-
నవజాత శిశువుల్లో హైపోగ్లైసీమియా
సాక్షి, విశాఖపట్నం: నవజాత శిశువుల్లో చక్కెర స్థాయిలు తగ్గుతుండటం ఆందోళన కలిగించే విషయమని ఈశాన్య రాష్ట్రాల ఎండోక్రైన్ సొసైటీ ఈసీ మెంబర్, వైద్య పరిశోధకురాలు డాక్టర్ అభామోనీ బారో అగర్వాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది ఈ హైపోగ్లైసీమియా వ్యాధి బారిన పడుతున్నారని వెల్లడించారు. శిశువుల్లో 72 గంటల్లో సాధారణ స్థాయిలకు చక్కెర నిల్వలు తీసుకురాకపోతే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ఎండోక్రైన్ జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా డాక్టర్ బారో అగర్వాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. శిశువుల్లో హైపోగ్లైసీమియా లక్షణాలు, వ్యాధిని గుర్తించడం, చికిత్స పద్ధతులు, నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి వివరించారు.హైపోగ్లైసీమియా ఎందుకు వస్తుందంటే...రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా అని పిలుస్తారు. మెదడు, శరీరానికి ఇంధనంలా పనిచేసే ప్రధాన వనరు గ్లూకోజ్. నవజాత శిశువుల్లో అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇది శిశువుల్లో వణుకు, చర్మం నీలంగా మారిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లికి సరైన పోషకాహారం అందకపోవడం, గర్భిణుల్లో మధుమేహం సరిగా నియంత్రించకపోవడం వల్ల ఎక్కువగా ఇది సంక్రమిస్తుంటుంది.నెలలు నిండకుండా పుట్టినవారికి, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు, వివిధ కారణాల వల్ల మందులు ఎక్కువగా వాడిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా బయటపడుతుంది. ప్యాంక్రియాస్ కణితి వంటి ఇతర కారణాల వల్ల శిశువు మలం ద్వారా ఎక్కువ ఇన్సులిన్ బయటికిపోతుంది. ఇది కూడా ఓ కారణమేనని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రోజూ జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది శిశువులు హైపోగ్లైసీమియా బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రతి 100 మంది నవజాత శిశువుల్లో 76 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది.గర్భిణులే జాగ్రత్త వహించాలిబిడ్డ కడుపులో పడినప్పటి నుంచి గర్భిణులు అత్యంత జాగ్రత్తగా నడచుకోవాలి. అప్పుడే ఈ తరహా వ్యాధులు చిన్నారుల దరికి చేరవు. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేని జీవితం గడపాలి. చక్కెర స్థాయిలు సక్రమంగా ఉండేటట్లుగా ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలి.ముందుగా గుర్తిస్తే మేలుశిశువుల్లో హైపోగ్లైసీమియాను గుర్తించేందుకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల కోసం సాధారణ రక్త పరీక్షలు చేస్తే సరిపోతుంది. ఒకవేళ శిశువుల్లో ఈ సమస్య ఉంటే వెంటనే దానిపై దృష్టిసారించాలి. పుట్టినప్పుడు తల్లి పాలు తాగిన తర్వాత 4 గంటల్లోపు గ్లూకోజ్ రీడింగ్ నమోదు చేయాలి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే వైద్యం అందించాలి.తర్వాత 24 గంటల్లోపు చెక్ చేసుకోవాలి. అలా ప్రతి 12 నుంచి 24 గంటలకు ఒకసారి పర్యవేక్షిస్తూ 72 గంటల్లోగా సాధారణ స్థాయికి తీసుకురావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. పిల్లలు పెరిగే కొద్దీ ప్రమాదకరంగా మారుతుంది. దేశంలో కేవలం 55 శాతం మంది నవజాత శిశువుల్లో మాత్రమే ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. వీరికే సకాలంలో వైద్యం అందుతోంది. 45 శాతం మందికి ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.అందుబాటులో అత్యుత్తమ వైద్యసేవలుఈ వ్యాధి బారిన పడిన శిశువులను 72 గంటల్లో ఆరోగ్యవంతులుగా మార్చేందుకు అనేక అత్యుత్తమ వైద్య సేవలు అందబాటులోకి వచ్చాయి. పుట్టిన శిశువు బరువు, నెలలు నిండాయా... లేదా..? ఇలా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి వైద్యం అందిస్తుండాలి. అప్పుడే చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చి.. శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుతాడు. గ్లూకోజ్ లెవెల్స్ మరీ దారుణంగా ఉన్న శిశువులకు 40శాతం డెక్ట్స్ట్రోస్ (చక్కెరలాంటి ఒక రూపం) జెల్‌ను నేరుగా నోటికి పూస్తారు. ఇలా వెద్య విధానాలు అందుబాటులోకి రావడం వల్లే చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. చిన్న వ్యాధే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. -
ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?
నాకు ఇప్పుడు 7వ నెల. జీటీటీ టెస్ట్ రాశారు. మా కుటుంబంలో ఎవరికీ షుగర్ లేకపోయినా నేను ఆ టెస్ట్ చేయించుకోవాలా? రిజల్ట్ ఎలా వస్తుందోనని భయపడి టెస్ట్ చేయించుకోలేదు. ఈ టెస్ట్ అందరికీ చేస్తారా? – షమా ఫిర్దౌజ్, బనగానపల్లె. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది ఒక రక్తపరీక్ష. 7వ నెల మొదట్లో గర్భిణీలందరికీ రొటీన్‌గా చేసే పరీక్ష. ఇది జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్‌ని కనిపెడుతుంది. మీ శరీరం సాధారణ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను మెయిన్టేన్ చేస్తుందా లేదా అనేది ఈ పరీక్ష ద్వారా చెక్ చేస్తారు. అందుకే జీటీటీ టెస్ట్‌ని గర్భిణీలందరికీ చేస్తారు. ముఖ్యంగా 85 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారికి, తొలి చూలులో బిడ్డ నాలుగున్నర కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువుతో పుట్టినా.. ముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా, కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా.. ఈ టెస్ట్ చేయాలి. జీటీటీలో రిజల్ట్ నార్మల్ వస్తే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రిస్క్ లేదని అర్థం. రిజల్ట్ అబ్నార్మల్ వస్తే డయాబెటీస్ స్పెషలిస్ట్‌ని సంప్రదించాలి. తీసుకోవాల్సిన డైట్, మానిటరింగ్‌ను వివరిస్తారు. ఈ మధ్యకాలంలో 2–12 శాతం వరకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కనిపిస్తోంది. -డా.భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఫుడ్ అలెర్జీ ఎందుకొస్తుందో తెలుసా?.. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి) -
మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!
మధుమేహం అని భయపడొద్దు. చక్కటి చిట్కాలతో మదుమేహన్ని అదుపులో పెట్టుకోవడమే గాదు రాకుండా చూసుకోవచ్చు. అదికూడా మీకు అందుబాటులో దొరికేవి, మనం నిత్యం చూసే వాటితోనే సులభంగా డయాబెటిస్‌కి చెక్పెట్టోచ్చు. ముఖ్యంగా మనం వంటలో నిత్యం ఉపయోగించే సుగంధద్రవ్యాలు, ఫైబర్‌తో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశమే ఉండదంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటంటే.. మదుమేహాన్ని నియంత్రించే సుగంధ ద్రవ్యాలు.. పసుపు భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించేది పసుపు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇది డయాబెటిక్‌కి సంబంధించిన అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క దీన్ని మనం కొన్ని రకాల రెసిపీల్లో ముఖ్యంగా ఉపయోగిస్తాం. ఇది టైప్2 డయాబెటిస్ ఉన్న వారిలో కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. వెల్లులి ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రక్తపోటు, కొలస్ట్రాయల్ స్థాయిలను తగ్గిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులకు చక్కటి ఔషధం. లవంగాలు ఇవి క్రిమి నాశక, క్రిమి సంహారక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అంటు వ్యాధులను నివారించడం తోపాటు గాయాలను త్వరితగతిన నయం చేస్తాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఫైబర్‌తో కూడిన ఆహారపదార్థాలంటే.. బీన్స్, బఠానీలు వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒక కప్పు బీన్స్, బఠానీళ్లలో సుమారు 15 గ్రాముల ప్రోటీన్, 15గ్రాముల ఫైబర్ ఉంటుంది. నట్స్, గుమ్మడి లేదా పుచ్చకాయ విత్తనాలు వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ,ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని సలాడ్లు, వోట్మీల్, పెరుగు వంటి వాటిలో కూడా చేర్చుకుని తినొచ్చు. వీటిలో సుమారు 5 నుంచి 10 గ్రాములు ప్రోటీన్, మూడు నుంచి 5 గ్రాముల ఫైబర్‌ను అందిస్తాయి. సోయా లేదా గోధుమ ఆధారిత ఉత్పత్తులు మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించొచ్చు. వీటిలో 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్, రెండు నుంచి 5 గ్రాముల ఫైబర్‌ను అందిస్తాయి. క్వినోవా, వోట్స్, బార్లీ మరియు ఇతర తృణధాన్యాలు ఇవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు. వీటిలో ప్రోటీన్, ఫైబర్ల తోపాటు వివిధ ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఒక కప్పు వండిన క్వినోవా, ఓట్స్, బార్లీ లేదా ఇతర తృణధాన్యాల్లో సుమారు 6 నుంచి 10 గ్రాముల ప్రోటీన్, 4 నుంచి 8 గ్రాముల ఫైబర్లు ఉంటాయి. ఇలాంటి ప్రోటీన్లు, ఫైబర్లతో కూడిన పదార్థాలు, సుగంధ ద్రవ్యాలను డయాబెటిస్ రోగుల తమ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు, ప్రోటీన్లు అందడమే గాక జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ సమృద్ధిగా పెరిగి ఎటువంటి రుగ్మతలు దరిదాపుల్లోకి రావు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మదుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్ స్థాయిలు పెరగకూడదంటే..) -
మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్ లెవెల్స్ పెరగకూడదంటే..
మధుమేహం వల్ల ఎన్నో రకాల రుగ్మతల బారిన పడతాం. పైగా ఒక్కోసారి గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోవడం లేదా డౌన్ అయిపోయి ప్రాణాల మీదకు వచ్చే ఉదంతాలు కోకొల్లలు. అందువల్ల సాధ్యమైనంత వరకు పేషెంట్లు తగు జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని నియంత్రించుకునేలా జాగ్రత్తలు పాటించాల్సిందే. ముఖ్యంగా శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్ సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. అందువల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని మదుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలంటే..! గ్లూకోజ్ అనేది శరీరానికి మంచి తక్షణ శక్తి వనరు. ఇది ఉంటేనే మన శరీరం రోజు వారి కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలదు. ఇది సమస్థాయిలో ఉండాలంటే ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు సక్రమైన రీతీలో ఉండాలి. ఈ ఒక్క దీర్ఘకాలిక మదుమేహ వ్యాధి.. గుండె, మూత్రపిండాలు, చర్మ సంబంధిత రుగ్మతలరే దారితీస్తుంది. అందువల్ల ముందుగానే మనం దీన్ని అదుపులో ఉంచుకోవాలి. వివిధ రుగ్మతలు బారినపడకుండా మంచి ఆహారపు శైలిని అలవరుచుకోవాలి. ముఖ్యంగా శారీరక శ్రమ, ఒత్తిడి తదితరాలు గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేసే కీలక అంశాలు. అందువల్ల శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం అనేది అత్యం ప్రధానంజ ఆరోగ్యకరంగా గ్లూకోజ్ లెవల్స్ ఉండాలంటే.. క్రమ తప్పకుండా వ్యాయామం చేయాలి. దీని వల్ల బరువు పెరగకుండా ఉండటమే కాకుండా మీలో ఉన్న శక్తి మంచిగా బర్న్ అవుతుంది. అలాగే రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయిలను కూడా మెరుగుపరిచేలా వారంలో ఒక్కరోజు అయినా సైక్లింగ్ లేదా ఈత వంటి వాటికి కనీసం 150 నిమిషాలు కేటాయించాలి. కండరాలు బలాన్ని పెంచడానికి బరువులు ఎత్తడం, వ్యాయామ నిపుణల పర్యవేక్షణలో అందుకు తగ్గ శిక్షణ తీసుకోవడం చేయాలి ఈ వ్యాధిగ్రస్తులు వ్యాయామం చేయడానికి ముందు తదుపరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేయించుకోవాలి. ఎలాంటి కార్బోహైడ్రేట్లు తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యం పండ్లు, కూరగాయాలు, చిక్కుళ్లు, వంటి ఫైబర్ అధికంగే ఉండే ఆహారపదార్థాలు గ్లూకోజ్ లెవల్స్‌ని సమస్థాయిలో ఉంచుతాయి. ముఖ్యంగా ఫైబర్ ఉండే ఆహారపదార్థాలు కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది. తొందరగా ఆకలి వేయదు. ఎక్కువ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పదార్థాలు తీసుకోండి. ఇవి గ్లైసమిక్ ప్రభావాన్ని తగ్గించి గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో కీలకంగా ఉంటాయి. అలాగే కండర ద్రవ్యరాశిని పెంచడానికి ప్రోటీన్లు సహాయపడతాయి. వీటి తోపాటు, ఆలివ్ నూనె, అవకాడో, చేపలు, గింజలు, వంటివి ఆహరంలో చేర్చితే ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. నీటిని పుష్కలంగా తాగండి. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పలుచన చేసి మూత్రం ద్వారా గ్లూకోజ్‌ని బయటకు పంపి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఆకలిని తగ్గించి కేలరీలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కనీసం రోజూకి సుమారు ఎనిమిది గ్లాసుల వరకు నీటిని తీసుకోండి. చక్కెర, కెఫిన్, ఆల్కహాల్ కృత్రిమ స్వీటెనర్లు కలిగిన పానీయాలకు(కూల్‌డ్రింక్‌లు) దూరంగా ఉండండి ఒత్తిడిని తగ్గించుకోండి. ఎందుకంటే? ఇది అడ్రినల్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. నిజానికి ఈ ఒత్తిడి అనేది కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన మూలం అని గుర్తించుకోండి. దీన్ని జయించాలంటే యోగా, మెడిటేషన్ వంటి వాటిని తప్పనసరిగా చేయాలి. తగినంతగా నిద్రపోండి. ఇవన్నీ రోజూ వారిగా అందరికీ ఉండే సమస్యలే అని కొట్టిపారేసి ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి మీ ఆహారం లేదా జీవనశైలిలో మార్పులు చేయాలనుకుంటే మంచి డైటీషియన్ లేదా వైద్య నిపుణుడి సలహా తీసుకోండి. తదితర జాగ్రత్తలు తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా మెరుగైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. (చదవండి: భారత్ డయాబెటిస్‌కి క్యాపిటల్‌గా మారుతోందా? 101 మిలియన్ల మందికిపైగా..!) -
మధుమేహగ్రస్థులు చక్కెరకు బదులు ఇది వాడొచ్చా?
చక్కెర.. పరిమితంగా తీసుకున్నంతవరకు తియ్యగానే ఉంటుంది... ఒకస్థాయిని మించితే మాత్రం ఆరోగ్యానికి చేదే! పరిమితి దాటిన చక్కెర మధుమేహంలాంటి అనేక అనారోగ్య సమస్యలు సృష్టిస్తుంది. అందుకే ఆరోగ్యంపై అవగాహన ఉన్న చాలామంది చక్కెరను దూరం పెడుతున్నారు. మరికొందరు మితంగా తీసుకుంటున్నారు. ఇంకొందరు ప్రత్యామ్నాయం ఎంచుకుంటున్నారు. ఈ ప్రత్యామ్నాయాల్లో ప్రకృతి సిద్ధంగా లభించే తేనెతోపాటు కృత్రిమంగా తయారుచేస్తున్న స్టివియా, ఎరిత్రిటోల్, గ్జైలిటోల్ వంటివి ఉన్నాయి. ఈ కోవలోకి తాజాగా అగావె నెక్టర్, అగావె షుగర్ చేరాయి. మధుమేహగ్రస్థులు వీటిని సాధారణ చక్కెరకు బదులు వాడొచ్చని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అందులోని వాస్తవాలేంటో తెలుసుకుందామిలా.. అగావె అంటే? అగావె అంటే మన దగ్గర కనిపించే కలబందలో ఒకరకం. ఉత్తర అమెరికాలోని మెక్సికోలో సుమారు 200కు పైగా కలబంద రకాలు కనిపిస్తాయి. వీటిలో రెండింటి నుంచి ఈ అగావె నెక్టర్(కలబంద తేనె), అగావె సుగర్ (కలబంద చక్కెర)ను తయారుచేస్తారు. అగావె నెక్టర్నే అగావె సిరప్గానూ వ్యవహరిస్తారు. ఇవి రెండే కాక కలబంద నుంచి ఆల్కహాల్ సైతం తయారుచేస్తారు. ఈ మూడింటి వినియోగం మెక్సికోలో శతాబ్దాలుగా ఉంది. సాధారణ చక్కెర కంటే మేలా? అన్ని చెట్లు, మొక్కల్లాగే కలబందలోనూ మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని మూలకాలు ఉన్నాయి. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్థులు సాధారణ చక్కెరకు ప్రత్యామ్నాయంగా కలబంద చక్కెర, తేనె తీసుకోవడంపై అనేక వాదనలున్నాయి. నిజానికి అగావె కలబందలో ఫ్రక్టోన్స్ లాంటి ఆరోగ్యకర ఫైబర్స్ ఉంటాయి. ఇవి జీవక్రియ సరిగా జరగడంలో తోడ్పడతాయి. అయితే, ఈ కలబందను తేనె, చక్కెరగా మార్చే ప్రక్రియలో వాటిలోని ఫైబర్స్ విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా వాటి సహజ లక్షణం కోల్పోతాయి. సాధారణంగా ఆహారంలోని చక్కెర ఎంత వేగంగా రక్తంలోకి చేరుతుందనేదానికి గ్లైస్మిక్ ఇండెక్స్(జీఐ)ను కొలమానంగా పరిగణిస్తారు. కాబట్టి జీఐ అధికంగా ఉంటే చక్కెర వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే గ్లూకోజ్లాగా ఫ్రక్టోజ్ రక్తంలోని చక్కెర స్థాయిలను తక్కువ వ్యవధిలోనే పెంచలేదు. అందువల్ల ఫ్రక్టోజ్ స్థాయి అధికంగా ఉన్న తీపి పదార్థాలను ఆరోగ్యకరమైనవిగా, మధుమేహ రోగులకు మేలు చేసేవిగా పరిగణిస్తారు. దీని ప్రకారం తక్కువ జీఐ ఉన్న కలబంద తేనె/చక్కెరలో ఫ్రక్టోజ్ ఎక్కువగానూ గ్లూకోజ్ తక్కువగానూ ఉండడంతో అది సాధారణకు చక్కెర కంటే మేలని ప్రచారంలోకి వచ్చింది. ఎలుకలపై చేసిన ఓ ప్రయోగం సైతం దీనిని బలపర్చింది. ఈ ప్రయోగంలో కొన్ని ఎలుకలకు సాధారణ చక్కెరను, మరికొన్నింటికి కలబంద చక్కెర ఇచ్చి 34 రోజుల తర్వాత వాటిని పరిశీలించారు. ఇందులో కలబంద చక్కెర తిన్న ఎలుకలు తక్కువ బరువు పెరగడంతోపాటు వాటి రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువున్నట్లు తేలింది. అయితే, ఈ ప్రయోగం కాలవ్యవధి స్వల్పం కావడంతో సాధారణ చక్కెరలోని గ్లూకోజ్.. రక్తంలోని సుగర్, ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేసినట్లు కలబంద చక్కెరలోని ఫ్రక్టోజ్ చేయకలేకపోయింది. అందువల్లే కలబంద తేనెలో తక్కువ జీఐ స్థాయి ఉన్నట్లు చూపుతోంది. ♦ సాధారణ చక్కెరలో, మొక్కజొన్న గింజలతో తయారుచేసే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్(హెచ్‌ఎఫ్‌సీఎస్)లోనూ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ చెరో 50శాతం ఉంటాయి. అయితే, కలబంద తేనె, చక్కెరలో దాదాపు 85శాతం ఫ్రక్టోజే ఉంటుంది. ♦ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లక్షణాలు చాలావరకు ఒకదానికొకటి సామీప్యంగా ఉన్నప్పటికీ మన శరీరంపై అవి చూపే ప్రభావాలు విభిన్నం. ♦ ప్రతిరోజు మనం తీసుకునే పండ్లు, కూరగాయలు, ఆహారంలో గ్లూకోజ్ తగినంత ఉంటుంది. ఒక్కోసారి మన శరీరం కూడా సొంతంగా కొంతమేర గ్లూకోజ్‌ను తయారుచేసుకుంటుంది. వాస్తవానికి అన్ని జీవకణాల్లోనూ గ్లూకోజ్ తప్పనిసరి మూలకం. ♦ మన శరీరంలోని ప్రతి కణం గ్లూకోజ్‌ను జీవక్రియకు ఉపయోగించుకోగలదు. కాలేయం మాత్రం ఫ్రక్టోజ్‌ను తన జీవక్రియకు వినియోగించుకుంటుంది. ♦ శరీరంలో ఫ్రక్టోజ్ అధికంగా చేరితే కాలేయంలో శోషణ ఎక్కువై అది కొవ్వుగా మారుతుంది. ఫలితంగా రక్తప్రసరణలో సమస్యలు ఏర్పడతాయి. జీవక్రియపై దుష్ప్రభావం చూపుతుంది. టైప్2 డయాబెటిస్, ఫాటీ లివర్ డిసీజ్ వస్తాయి. అనేక పరిశోధనలు దీన్ని రుజువు చేశాయి. ♦ శరీరంలో ఫ్రక్టోజ్ ఎక్కువైనప్పుడు కొవ్వు శాతం పెరిగి రక్తంలో సుగర్, ఇన్సులిన్ స్థాయిలు అధికమవుతాయి. ఫలితంగా మెటబాలిక్ సిండ్రోమ్, టైప్2 డయాబెటిస్‌కు దారితీస్తాయి. అలాగే చెడు కొవ్వు విపరీతంగా పెరిగిపోయి ఊబకాయానికి దారితీస్తుంది. ♦ అందువల్ల మధుమేహగ్రస్థులు కలబంద తేనె/చక్కెరకు బదులు స్టివియా, ఎరిత్రిటోల్, గ్జైలిటోల్ వంటి ప్రత్యామ్నాయ చక్కెర/సిరప్‌లను తీసుకోవడం ఉత్తమం. సో.. మిగిలిన అన్ని రకాల చక్కెరలతో పోలిస్తే కలబంద చక్కెరలో అతి తక్కువ తీపిస్థాయిలు ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా సాధారణ చక్కెరే శ్రేష్టం! చదవండి: -
హెల్త్ టిప్స్
►అరటిపండులో చక్కెర... సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి సహజరూపంలో ఉంటాయి. పీచు పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల సేపు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతిరోజూ అరటిపండు తింటే శక్తితోపాటు జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. ►ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్య ఉన్న వాళ్లు పీరియడ్స్‌కు కనీసం వారం ముందు నుంచి ప్రతిరోజూ అరటిపండు తింటుంటే ఆ సమయంలో ఆందోళన, ఉద్వేగం వంటి లక్షణాలు అదుపులో ఉంటాయి. ►ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఎనీమియాను అరికడుతుంది. బ్లడ్‌ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది. గుండెపోటును నివారించడంలో బాగా పని చేస్తుంది. -
‘విటమిన్ – డి’ తో మధుమేహ నివారణ!
సూర్యుడి నుంచి ఉచితంగా అందే విటమిన్ – డి శరీరానికి చేసే ఉపయోగాలు ఎన్నో. బ్రెజిల్‌లోని ద నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనలు, విటమిన్ – డి ద్వారా మధుమేహం రాకుండా చూసుకోవచ్చు అని చెబుతున్నాయి! కొన్ని ఇతర పరిశోధనలు కూడా విటమిన్ – డి ద్వారా రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను నియంత్రించుకోవచ్చునని చెబుతూండటం విశేషం. విటమిన్ – డి లేమి రక్తంలోని గ్లూకోజ్ మోతాదులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు బ్రెజిల్ శాస్త్రవేత్తలు దాదాపు 680 మంది మహిళలపై పరిశోధన చేశారు. దాదాపు 34 శాతం మంది డి – విటమిన్‌ను వాడుతూండగా.. వారిలో గ్లూకోజ్ మోతాదులు తగు నియంత్రణలో ఉన్నట్లు తెలిసింది. మాత్రల రూపంలో కాకుండా.. అప్పుడప్పుడూ ఎండలో గడిపిన వాళ్లలోనూ ఇవే రకమైన ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జో ఆన్ పింకెర్టన్ తెలిపారు. విటమిన్ – డి తక్కువగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనం ద్వారా తేలిందని చెప్పారు. మరికొన్ని విస్తృత పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకుంటే మధుమేహ నియంత్రణకు చౌకైన కొత్తమార్గం లభిస్తుందని వివరించారు. -
సూదుల బెడద తప్పించే కాగితం సెన్సర్లు...
రక్తంలోని గ్లూకోజు మోతాదులను గుర్తించేందుకు రోజూ సూదులతో గుచ్చుకుంటున్నారా? మీ కష్టం ఇంకొంత కాలం మాత్రమే. ఎందుకంటే సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు కాగితం సెన్సర్లతోనే ఈ పని కానిచ్చేందుకు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సాహికా ఇనాల్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల్లో వ్యక్తుల లాలాజలం ఆధారంగానే గ్లూకోజు మోతాదు నిర్ధారణ అవడం ఇంకో విశేషం. సాధారణ ఇంక్ జెట్ ప్రింటర్లో వాడే ఇంక్‌కు విద్యుత్తు ప్రసార సామర్థ్యమున్న ప్లాస్టిక్‌ను కలపడం ద్వారా ఈ కాగితం సెన్సర్ల తయారీ మొదలవుతుంది. ఈ ఇంకుతో కాగితంపై ఎలక్ట్రోడ్లను ముద్రించడం.. దానిపై గ్లూకోజ్ ఆక్సిడేజ్ ఎంజైమ్‌ను ఒక పూతగా పూయడంతో.. ఈ రెండింటిపై నాఫియన్ పాలిమర్ తొడుగు ఒకటి ఏర్పాటు చేయడంతో సెన్సర్ తయారీ పూర్తవుతుంది. ఈ సెన్సర్లపై లాలాజలం చేరినప్పుడు అందులోని గ్లూకోజ్ కాస్తా గ్లూకోజ్ ఆక్సిడేజ్తో చర్య జరుపుతుంది. ఫలితంగా పుట్టిన విద్యుత్ సంకేతాన్ని ఎలక్ట్రోడ్లు గుర్తిస్తాయి. సంకేతపు తీవ్రతను బట్టి శరీరంలోని గ్లూకోజ్ మోతాదును నిర్ధారిస్తారు. ఈ సెన్సర్లను కనీసం నెలరోజులపాటు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. బ్యాటరీలు, తీగల్లాంటివి లేకుండా చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నామని.. సెన్సర్లను మరింత సమర్థంగా పనిచేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సాహికా ఇనాల్ తెలిపారు. -
మందుల కారణంగా మధుమేహ సమస్యలు తీవ్రం!
మధుమేహ చికిత్స కోసం వాడే కొన్ని రకాల మందులు... కీటో అసిడోసిస్ అనే రుగ్మతకు.. తద్వారా కాలి దిగువ భాగాలను తొలగించాల్సిన పరిస్థితులకు దారితీస్తున్టన్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఒక పరిశోధన వ్యాసాన్ని ప్రచురించింది. మధుమేహ చికిత్సలో సోడియం గ్లూకోజ్ కోట్రాన్స్పోర్టర్ (ఎస్జీఎల్టీ2) బహుళ ప్రాచుర్యం పొందిందని, మూత్ర పిండాల ద్వారా చక్కెరలను శరీరం వెలుపలకు పంపేందుకు ఇవి సహకరిస్తాయి. అయితే ఈ మందులు సురక్షితమైనవేనా అన్న అంశంపై తొలి నుంచి సందేహాలు ఉన్నాయి. మూత్రపిండాలకు నష్టం మొదలుకొని ఎముకలు తొందరగా విరిగిపోవడం వల్లకు అనే దుష్ప్రభావాలకు ఇదికారణమని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అంతరాŠఝతీయ శాస్త్రవేత్తల బందం ఒకటి స్వీడన్, డెన్మార్క్‌లకు చెందిన వేల మంది మధుమేహులపై ఒక పరిశోధన చేపట్టింది. 2003 – 2016 మధ్యకాలంలో ఎస్జీఎల్టీ2 మందు వాడేవారిని, జీఎల్పీ1 మందు వాడేవారిని పోల్చి చూసింది. మిగిలిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఎస్జీఎల్టీ2 మందు తీసుకునే వారికి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. -
బరువును విసిరి కొట్టండి!
బరువు తగ్గడానికి ప్రపంచంలో ఉన్న ?డైట్ ప్లాన్స్ అన్నీ వివరించాం.కాని అసలైన డైట్ మన వాకిలి ముంగిటే ఉంది.మన చేలలోనే ఉంది.పంట పొలాల్లోనే పండుతోంది. సిరి ధాన్యాలతో ఒంటి మీద పేరుకున్న అదనపు సిరిని వదిలించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. తరిమికొట్టవచ్చు.అరికలు, సామలు, ఊదలు, కొర్రలు... ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యవంతం చేయడమే కాదు బరువును అదుపు చేస్తాయి. భారాన్ని తగ్గిస్తాయి. సిరిధాన్యాలతో బరువును విసిరికొట్టండి. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో మార్పు వచ్చింది. తినే ఆహారం మారిపోయింది. పీచుపదార్థం, పిండిపదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని మానవాళి గత కొద్ది దశాబ్దాలుగా వదిలిపెట్టింది. ఆధునికత పేరుతోనో, సౌలభ్యం కోసమనో పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహారానికి తోడు వ్యాయామం/నడక చాలావరకూ తగ్గిపోతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిండిపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినటం, వ్యాయామం లోపించడం, స్టెరాయిడ్స్ తీసుకోవటం తప్ప.. ఇటీవల దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య తామరతంపరగా పెరగడానికి మరో మూల కారణమేదీ లేదు. అనువంశికత కారణం కాదు. ఊబకాయానికి, మధుమేహానికి కూడా ముఖ కారణాలు ఇవే. గతంలో ఊబకాయుల సంఖ్య తక్కువ ఎందుకని? పూర్వం ఊబకాయంతో బాధపడే ప్రజలు దాదాపుగా లేరు. క్రీ.శ.1900 వరకు ఊబకాయ సమస్య పహిల్వానులు వంటి వాళ్లలో తప్ప సాధారణ ప్రజానీకంలో చాలా అరుదుగా ఉండేది. ఎందుకనంటే, అప్పట్లో గ్లూకోజ్ నిదానంగా రక్తంలో కలిసేందుకు అనువైన ఆహారం మనం తింటూ ఉండేవాళ్లం. అదీకాకుండా, ప్రజలంతా రోజూ చాలా సేపు నడిచేవారు. అంటే, ఆహారం ద్వారా రక్తంలోకి చేరే గ్లూకోజ్ ఖర్చు అయ్యేది. ఎప్పుడైతే గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ అవుతూ, పేరుకుంటూ వస్తున్నదో అప్పుడు గ్లైకోజన్ గాను, కొవ్వు గాను, మాంసం గాను మార్చే వ్యవస్థ తయారవుతుంది. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ మొదలవుతాయన్నమాట. వీటికితోడు కాలక్రమంలో పంచదార ఉత్పత్తి, వినియోగం బాగా పెరిగింది. చక్కెర ఉత్పత్తి క్రీ.శ. 1846 నుంచే ప్రారంభమైంది. గడచిన 70 సంవత్సరాల్లో వరిబియ్యం, గోధుమలతోపాటు పంచదార వినియోగం బాగా పెరిగింది. వరి, గోధుమల్లో పీచుపదార్థం అతి తక్కువగా ఉంది. పంచదార ద్వారా తీసుకునే గ్లూకోజ్‌ను ఖర్చు చేసే వ్యాయామం చేయకపోవడం వల్ల ఊబకాయం ఏర్పడుతోంది. సూటిగా చెప్పుకోవాల్సిందేమిటంటే.. ఆహారంలో వచ్చిన మార్పు వల్ల, వ్యాయామం తగ్గిపోవడం వల్ల ఊబకాయం వచ్చింది. సరైన ఆహారం తినాలి. సరిగ్గా వ్యాయామం చేయాలి. అప్పుడే తిరిగి సంపూర్ణ స్థితి నెలకొంటుంది. అంటే ఊబకాయులు తమ శరీరంలో అతిగా పెరిగిన మాంసం, కొవ్వు పదార్థం, గ్లైకోజెన్ కరిగించుకునేలా ఆహార విహారాలను నియమబద్ధంగా మార్చుకోవాలి. అంటే, ఎక్కువగా నడవాలి. గ్లూకోజ్‌ను రోజూ నడక ద్వారా ఖర్చు చేయాలి. అదే సమయంలో.. ఆహారం ద్వారా గ్లూకోజ్ నిదానంగా రక్తంలోకి వచ్చేలా చూడాలి. సిరిధాన్యాలను ఎప్పుడో ఒక సారి కాకుండా రోజువారీగా ముఖ్య ఆహారంగా తింటూ ఉంటేనే ఇది సాధ్యమవుతుందని గుర్తించాలి. స్టెరాయిడ్స్ వల్ల ఊబకాయం.. ఆహారం వల్ల సహజంగా ఊబకాయం తయారవటం ఒకటైతే వైద్యచికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం కూడా ఊబకాయానికి మరో ముఖ్య కారణం. రోగాలకు చికిత్సలో భాగంగా ఈ మధ్యకాలంలో డాక్టర్లు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఆడవాళ్లలో హార్మోన్ అసమతుల్యతకు, ఆస్తమా, నొప్పి మందులుగా వాడుతున్నారు. సాధారణంగా ఆహార విహారాలలో మార్పుల వల్ల కన్నా స్టెరాయిడ్స్ వాడే వారికి మరింత వేగంగా ఊబకాయం వస్తుంది. స్టెరాయిడ్స్ వల్ల ఆకలి ఎక్కువ కావటం వల్ల ఎక్కువగా తినటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల కూడా కొందరు ఊబకాయులుగా మారుతున్నారు. మాంసం, కోడిగుడ్లను తక్కువ రోజుల్లో అధికోత్పత్తి సాధించే క్రమంలో పశువులకు, కోళ్లకు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. అలా ఉత్పత్తయిన మాంసం, కోడిగుడ్లను తిన్న వారి ఆరోగ్యంపై కూడా ఈ స్టెరాయిడ్స్ ప్రభావం ఉంటుంది. వీళ్లు కూడా ఎక్కువ తినటం మొదలు పెట్టి ఊబకాయులుగా మారిపోతున్నారు. మాంసాహారం తినటం అంతకంతకూ ఎక్కువై పర్యావరణ అసమతుల్యతకు దారితీస్తోంది. జంతువుల పాలు మనిషి ఆరోగ్యానికి సరిపడవు. పాలు, టీ, కాఫీలు తాగటం వల్ల హార్మోన్ అసమతుల్యత మనుషుల ఆరోగ్యాన్ని అస్థవ్యస్థం చేస్తోంది. పాలను తోడు వేస్తే ఈ అలసమతుల్యత సమసి పోతుంది. కాబట్టి, పెరుగు, మజ్జిగ పర్వాలేదు. మొత్తంగా ప్రపంచం ఇప్పుడు తింటున్న ఆహారం పర్యావరణానికి కూడా పెనుముప్పుగా మారాయి. సిరిధాన్యాలతో మనుషులు సంపూర్ణ ఆరోగ్యం పొందటమే కాకుండా భూతాపాన్ని కూడా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. మెట్ట రైతులనూ బతికించుకోవచ్చు. నెమ్మదిగానైనా రోజూ నడవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయం గంట, సాయంత్రం గంట నడవాలి. అధికబరువు ఉన్న వారు నడవడానికి ఇబ్బందులు ఉంటాయి. అయితే, ఈ రోగానికి కారణభూతాలైన ఆహారం తినటం మాని, సిరిధాన్యాలు తినటం, కషాయాలు తాగటం మొదలు పెడితే వారికి నడిచే శక్తి వస్తుంది. కీళ్ల నొప్పులు, సంధివాతం కొర్రలతోనే బాగువుతుంది. అందుకే ఐదు ధాన్యాలూ తినాలి. అరికెలు, సామలు ఎక్కువ రోజులు తింటూ మిగతా 3 ధాన్యాలూ తక్కువ రోజులు తినాలి. ఊబకాయులు వేగంగా నడవనక్కర లేదు. నెమ్మదిగా నడిచినా చాలు. ఉదయం, సాయంత్రం గంట చొప్పున వారికి చేతనైనంత వేగంతో నడవవచ్చు. రోజులు గడిచేకొద్దీ వారు బాగా నడవగలుగుతారు. వేగంగా తగ్గటం మంచిది కాదు.. ఆహారంలో, శారీరక వ్యాయామంలో వచ్చిన మార్పు వల్ల ఊబకాయం మరీ వేగంగా పెరగదు. కొన్ని ఏళ్లపాటు, నిదానంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి, తగ్గేటప్పుడు కూడా ఆహారంలో మార్పు చేసుకొని, నడక వంటి వ్యాయామం క్రమబద్ధంగా చేస్తూ నిదానంగానే ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. సిరిధాన్యాలు తింటూ, కషాయాలు తాగుతూ, నడుస్తూ ఉంటే.. ఆరు నెలల నుంచి రెండేళ్లలో వయసు, ఎత్తుకు తగిన బరువును సంతరించుకోవటంతోపాటు.. ఏ వయస్కులైనా, ఏయే జబ్బులున్న వారైనా, ఆడవారైనా, మగవారైనా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. 6 నెలల్లో 10–25 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. మరీ ఎక్కువ బరువున్న వారు కొంచెం వేగంగా, మధ్యస్థంగా అధిక బరువున్న వారు కొంచెం నెమ్మదిగా బరువు తగ్గుతారు. ఉదాహరణకు 100 కిలోల బరువున్న మనిషి ఆహార విహారాలను మార్చుకుంటే ఆరునెలల్లో 12 కిలోల వరకు తగ్గొచ్చు. 80–90 కిలోలున్న వారు అదే ఆరునెలల్లో 10 కిలోలు తగ్గొచ్చు. చిన్న వయస్కులైన ఊబకాయులు 50 ఏళ్లు దాటిన ఊబకాయులకన్నా కొంచెం వేగంగా బరువు తగ్గుతారు. ఇంతకన్నా వేగంగా బరువును తగ్గించే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అవి ప్రమాదకరం.మరీ వేగంగా బరువు తగ్గటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల కిడ్నీ సంబంధమైన సమస్యలు వస్తాయి. హానికరమైన ఆహారాన్ని తినటం మానేసి చిరుధాన్యాలను (కనీసం 2–4 గంటలు నానబెట్టుకొని వంట చేసుకోవటం విధిగా పాటించవలసిన చాలా ముఖ్యమైన నియమం) తింటూ, కషాయాలు తాగుతూ, క్రమం తప్పకుండా నడుస్తూ ఉంటే.. ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు ఎంతటి రోగాలున్న వారైనా (అవసరాన్ని బట్టి హోమియో/ఆయుర్వేద మందులను తీసుకోవాలి) ఆయా రోగాల పీడ నుంచి పూర్తిగా బయటపడటమే కాకుండా.. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని నా దగ్గరకు వచ్చిన వేలాది మంది సాక్షిగా బల్లగుద్ది చెప్పగలను. అరికెలు, సామలు ఎక్కువ రోజులు తినాలి.. ఏ కారణంగా ఊబకాయం వచ్చినా.. ఊబకాయాన్ని ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవాలనుకునే వారు మొదట ఆహారం మార్చుకోవాలి. గ్లూకోజ్‌ను అసమతుల్యంగా, తక్కువ సమయంలోనే రక్తంలోకి పంపించే వరి బియ్యం, గోధుమలు, మైదాతో చేసిన ఆహారాన్ని తినటం మానేయాలి. గ్లూకోజ్‌ను సమతుల్యంగా, కొన్ని గంటల పాటు నెమ్మదిగా రక్తంలోకి వదిలే సిరిధాన్యాలను ముఖ్య ఆహారంగా తినాలి. వరుసగా మూడు రోజులు అరికెలు, మరో మూడు రోజులు సామెలు రోజువారీ ముఖ్య ఆహారంగా తినాలి. కొర్రలు, ఊదలు, అండుకొర్రలను వరుసగా ఒక్కోరోజు తినాలి. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి. సిరిధాన్యాలు తింటే ఏమవుతుంది? కాలేయం, క్లోమం.. ఇవన్నీ తమ పనులను సక్రమంగా పనిచేయాలంటే రక్తం శుద్ధంగా ఉండాలి. రక్తం పలచగా, తేలిగ్గా ఉండి, ఇమ్యునో బాగ్యులన్స్ అన్నీ సరిగ్గా ఉంటేనే నిర్ణాల గ్రంథులన్నీ(ఎండోక్రైన్ గ్లాండ్స్) సరిగ్గా పనిచేసేది. రక్తం శుద్ధ కావటానికి, నిర్ణాల గ్రంధులు సరిగ్గా పనిచేయటానికి ఈత ఆకు కషాయం పని చేస్తుంది. దీనికి తోడు సిరిధాన్యాలు ప్రధాన ఆహారంగా తినాలి. ఇలా చేస్తే దేహంలో పేరుకున్న కొవ్వు, మాంసం క్రమంగా కరగటం ప్రారంభమవుతుంది. పసుపు, గరిక, ఈత ఆకుల కషాయాలు తాగాలి సిరిధాన్యాలు తినటంతోపాటు.. పసుపు, గరిక, ఈత ఆకుల కషాయాలు తాగాలి. వీటిల్లో వారానికి ఒక రకంæచొప్పున తాగాలి. ఉదయం, సాయంత్రం తాగాలి. దీనిలో కొంచెం ఈతబెల్లం లేదా తాటిబెల్లం పాకాన్ని రెండు చుక్కలు కలుపుకుంటే.. కషాయం రుచిగానూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈతబెల్లం జనాన్ని సన్నగా ఉంచుతుంది. ఈతాకులో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల మజ్జలో పనిచేస్తుంది. ఎముకల మజ్జ శుభ్రం అయితేనే ఊబకాయం తగ్గుతుంది. – డా. ఖాదర్ వలి, స్వతంత్ర శాస్త్రవేత్త, ప్రముఖ ఆహార, ఆరోగ్య నిపుణులు, హోమియో వైద్యులు, మైసూరు -
బరువుతోపాటు మధుమేహమూ తగ్గేది ఇందుకే!
మధుమేహం వచ్చిందంటే.. క్లోమగ్రంధిలోని బీటా కణాలు అస్సలు పనిచేయవని.. ఈ లోపాన్ని సరిదిద్దుకోవడం సాధ్యం కాదన్నది అపోహ మాత్రమేనని నిరూపించారు న్యూక్యాజిల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఇటీవల తాము జరిపిన ఒక అధ్యయనంలో టైప్–2 మధుమేహంతో బాధపడుతున్న వారు బరువు తగ్గగానే సగం మందిలో వ్యాధి లక్షణాలు పూర్తిగా మాయమైపోయాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రాయ్ టేలర్ అంటున్నారు. మధుమేహం ఉన్నట్లు గుర్తించిన ఆరు ఏళ్లలోపు బరువు తగ్గిన వారిలో తాము ఈ విషయాన్ని గమనించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 42.2 కోట్ల మంది మధుమేహులు ఉండగా... ఎక్కువ మంది బరువు తగ్గడంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని.. వ్యాధిబారిన పడిన వెంటనే గణనీయమైన స్థాయిలో బరువు తగ్గడం ద్వారా బీటా కణాలు పూర్తిగా నిర్వీర్యమైపోకుండా రక్షించుకోవచ్చునని ఆయన వివరించారు. బీటా కణాలు రక్తంలో ఎక్కువయ్యే గ్లూకోజు ఆధారంగా రెండు దఫాలుగా ఇన్సులిన్ ను విడుదల చేస్తుందని, టైప్–2 మధుమేహుల్లో ఒక దశలో మాత్రమే ఇన్సులిన్ విడుదలవుతున్నట్లు గుర్తించామని రాయ్ అంటున్నారు. బరువు తగ్గిన తరువాత తొలిదశ ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పనిచేయడం... తద్వారా రక్తంలోని గ్లూకోజు తగ్గడం తాము గుర్తించామని వివరించారు. -
ఉపవాసం చేసే ఇంకో మేలు...
ఉపవాసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గతంలో పలు పరిశోధనలు రుజువు చేశాయి. తాజాగా మరో మంచి విషయం తెలిసింది. నిరాహారంగా ఉండటం వలన మన పేవుల్లో ఉండే మూలకణాల పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందట. సాధారణంగా పేవుల్లోని ఈ మూలకణాలు తగ్గితే ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి తేరుకోవడం కష్టం. వయసు పెరిగే కొద్దీ ఈ మూలకణాల పునరుత్పత్తి సామర్థ్యం సహజంగానే తగ్గిపోతుంటుంది. అయితే ఉపవాసం చేసినప్పుడు మాత్రం వీటి సంఖ్య గణనీయౖ స్థాయిలో పెరుగుతున్నట్లు గుర్తించామని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జీవశాస్త్రవేత్తలు చెప్పారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కేవలం 24 గంటల ఉపవాసంతోనే మూలకణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగినట్లు తెలిసిందిట. ఉపవాసం ఉన్నప్పుడు కణాలు గ్లూకోజ్ బదులుగా కొవ్వులను ముక్కలుగా చేస్తాయని ఫలితంగా మూలకణాలు చైతన్యవంతమై పునరుత్పత్తి వేగం పుంజుకుంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఓమెర్ ఇల్మాజ్ తెలిపారు. ఈ జీవక్రియను ప్రేరేపించే ఓ మూలకాన్ని తాము గుర్తించామని ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి, కీమోథెరపీ చేయించుకుంటున్న రోగులకూ ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఉపవాసంకు పేవులకు సంబంధించిన చాలా సమస్యలకు చెక్ పెట్టే సామర్థ్యముందని ఇందులో కేన్సర్ కూడా ఒకటని ఇల్మాజ్ వివరించారు. -
మీరు తిన్న తిండిని పసిగట్టేస్తుంది...!
అతి చిన్న సెన్సర్ సహాయంతో రోజూ తీసుకునే ఆహారం దానితో ముడిపడిన ఆరోగ్య అంశాలను రియల్ టైమ్‌లో (ఎప్పటికప్పుడు) పర్యవేక్షించవచ్చునని టఫ్ట్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు లేదా వైద్యపరమైన అంశాల అధ్యయనానికి ఇది కీలకంగా మారనుంది. ఈ పరిశోధకులు రూపొందించిన సెన్సర్‌ను పంటిపై అమర్చి, దానిని మొబైల్‌కు అనుసంథానిస్తే చాలు.. మనం తీసుకున్న ఆహారంలోని గ్లూకోజ్ (చక్కెర), ఉప్పు, సేవించిన మద్యానికి సంబంధించిన సమాచారం ట్రాన్స్మిట్ అవుతుంది. వీటి ద్వారా పోషకాలు, రసాయనాలు,శారీరికపరమైన అంశాలు గుర్తించవచ్చు. ఆహార పర్యవేక్షణకు గతంలో అనుసరించే పద్ధతుల్లో కచ్చితత్వం కొరవడడంతో 2 మి.మీ పరిమాణంలో స్సెనర్ను రూపొందించినట్టు టఫ్ట్స్ ఇంజనీర్లు వెల్లడించారు. మూడు దొంతరలుగా రూపొందించిన ఈ సెన్సర్లు చిన్న యాంటెన్నాలుగా రేడియో ప్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌లో తరంగాలు స్వీకరించి, ప్రసారం చేస్తాయి. ఉప్పు ,ఇథనాల్, తదితర వస్తువులు తీసుకున్నపుడు వేర్వేరు రేడియో ఫ్రీక్వెన్సీలు ప్రసారం చేస్తాయి. ఈ విధంగా పోషకాలు, ఇతర అంశాలు గుర్తిస్తారు. సాథారణంగా ఉపయోగించే రేడియో ప్రీక్వెన్సీ ఐడీ (ఆర్ఎప్ఐడీ) సాంకేతికతనే సెన్సర్ ప్యాకేజీలోకి మరింతగా విస్తరించి నిర్దేశిత ఫలితాలు సాధించినట్టు పరిశోధకులు ఫియోరెంజో ఒమెనెట్టో, ఫ్రాంక్ సి.డొబుల్ తెలిపారు. ఈ సెన్సర్‌ను పంటిపై, చర్మంపై లేదా మరెక్కడైనా అమర్చినా ఈ సమాచారాన్ని పొందవచ్చన్నారు. యూఎస్ ఆర్మీ నాటిక్ సోల్జర్ రిసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ సెంటర్, ది నేషనల్ ఇనిసిట్యూట్స్ ఆఫ్ హెల్త్, నేషనల్ ఇనిసిట్యూట్ ఆఫ్ బయో మెడికల్ ఇమేజింగ్ అండ్ బయో ఇంజనీరింగ్, ఆఫీస్ ఆఫ్ ది నేవల్ రిసెర్చి సహకారంతో ఈ అధ్యయనం జరిపారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గ్లూకోజ్‌ను నియంత్రించే కృత్రిమ క్లోమం....
లండన్ : రక్తంలో గ్లూకోజ్‌కు తగ్గట్లు ఇన్సులిన్‌ను సరఫరాచేసే కృత్రిమ క్లోమాలు 2018 కల్లా అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కృత్రిమ క్లోమాలతో వాటంతట అవే గ్లూకోజ్‌ను పరీక్షించి, కావల్సిన మోతాదులో ఇన్సులిన్‌ను సర్దుబాటు చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ కృత్రిమ క్లోమాలను అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షిస్తోంది. 2018 చివరికల్లా యూరప్‌లో అందుబాటులోకి రానున్నాయన్నారు. అయితే ఈ కృత్రిమ క్లోమాలకు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ... వీటికి శస్త్రచికిత్సలు, మందులు అవసరం ఉంటుంది. -
మూసీ నీటితో మల్టీవిటమిన్ టానిక్ లు
♦ నకిలీ మందుల తయారీ గుట్టురట్టు ♦ రూ. 30 లక్షల సరుకు స్వాధీనం ♦ రెండు కంపెనీలు సీజ్ చేసిన ఎస్వోటీ పోలీసులు ఉప్పల్ : చిన్న పిల్లల ఎదుగుదలకు అవసరమయ్యే మల్టీ విటమిన్స్ టానిక్‌లు, న్యూట్రిషన్స్, గ్లూకోజ్‌లను బ్రాండెడ్ల కంపెనీల పేరుతో సరిపోలేలా కొద్దిపాటి మార్పులతో ప్యాకింగ్ చేసి నకిలీ మందులను, పోషకపదార్ధాల తయారీ కేంద్రంపై మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించి రూ.30 లక్షల విలువైన నకిలీ మందులు, టానిక్లను స్వాదీనం చేసుకున్నారు. ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన జిల్లా శ్రీరాములు, గంగాధర్‌రెడ్డి పదేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి రామంతాపూర్‌లో స్థిరపడ్డారు. టీవీ కాలనీలోని మూసీ నాలా సమీపంలో రెండు ఇళ్లను అద్దెకు తీసుకొని మెడికెమ్ ల్యాబ్స్, శ్రీసాయి వర్ష న్యూట్రిషన్ పేరుతో కంపెనీలు ఏర్పాటు చేశారు. బీ ఫార్మసీ పట్టభద్రుడైన శ్రీరాములు ప్రముఖ న్యూట్రిషన్ కంపెనీల పేర్లను ఒక్క అక్షరం తేడాతో లేబుల్‌లను తయారుచేస్తూ దాదాపు 30 రకాల మల్టీ విటమిన్ టానిక్‌లు, ఎనిమిది రకాల మాత్రలను మార్కెట్‌కు సరఫరా చేసేవాడు. వీరి కంపెనీలకు సం బందించి 2006 నుండి లెసైన్స్ రెన్యువల్ చేయకపోగా, గడువు తీరిన మందులపై కొత్త తేదీలను ముద్రించి విక్రయించేవారు. వీటిని ఎక్కువ కమీషన్ ఆశ చూపి ఏజెన్సీల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సహా పొరుగు రాష్ట్రాల్లో విక్రయించేవారు. వీరికి హిమాయత్‌నగర్‌లోని వెంకటనారాయణ ప్రింటింగ్ ప్రెస్‌లో మందులకు అవసరమయ్యే ప్యాకింగ్‌లు, లేబుల్లు తయారు చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూసీ నీటితోనే మందుల తయారీ నిందితులు తయారుచేసే నకిలీ సిరప్, టానిక్‌లకు మూసీ సమీపంలో వేసిన బోరు నీటినే వాడుకుంటుం డటం గమనార్హం. దాడుల్లో మల్కాజిగిరి ఎస్వోటీ ఎస్సై రాములు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. -
ఊపిరితో గ్లూకోజ్ మోతాదు తెలుసుకోవచ్చా?
మధుమేహ బాధితులకు శుభవార్త. రక్తంలో గ్లూకోజ్ మోతాదును పరీక్షించుకునేందుకు రోజూ సూదితో గుచ్చుకుంటున్నారా? అయితే మీ కష్టాలకు త్వరలోనే చెల్లుచీటీ పాడేయొచ్చంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు. మనం వదిలే ఊపిరి ద్వారానే గ్లూకోజ్ మోతాదును లెక్కవేయొచ్చని పరిశోధన పూర్వకంగా ఓ అంచనాకు వచ్చారు. సాధారణ ప్రజల నిశ్వాసాల్లో ఇసోప్రీన్ అనే వాయువు చాలా కొద్ది మోతాదులో ఉంటుందని, రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉండే వారిలో చాలా ఎక్కువగా ఉంటుందని.. ఎనిమిది మంది టైప్-1 మధుమేహ బాధితులపై జరిపిన అధ్యయనం ద్వారా స్పష్టమైంది. కొలెస్ట్రాల్ తయారీలో భాగంగా ఈ వాయువు ఉత్పత్తి అవుతుందని ఇప్పటికే తెలిసినప్పటికీ.. రక్తంలో గ్లూకోజ్ మోతాదు తగ్గడానికి దీనికి సంబంధం ఏమిటన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇసోప్రీన్ వాయువుతో మనకొచ్చిన ఇబ్బందేమీ లేకపోయినా.. కుక్కలకు మాత్రం ఈ వాసనంటే అస్సలు పడదు. అందుకే ఈ రకమైన హైపోగ్లైసీమియాతో బాధపడే వారిని కుక్కలు ఇట్టే పసిగట్టి దూరంగా జరుగుతాయి. ఈ లక్షణాన్ని మరింత అర్థం చేసుకోగలిగితే రక్తంలో గ్లూకోజ్ మోతాదు ఎంత ఎక్కువైందన్నది తెలుసుకోవచ్చని.. మందుబాబులను పట్టుకునేందుకు వాడే బ్రీత్ఎనలైజర్ వంటి పరికరాలను తయారు చేయవచ్చని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు అంటున్నారు. -
జంతువులను పాము కాటు నుండి .....
ప్రథమ చికిత్స ఇలా.. పాము కరిచిన చోట పైభాగాన బట్టతో గట్టిగా కట్టాలి కాటేసిన స్థలంలో బ్లేడుతో కోసి రక్తాన్ని పిండేయాలి {పతి 20 నిమిషాలకు కట్టును వదులుగా మళ్లీ కట్టు కట్టాలి పాము కరిచిన పశువుకు ఫామ్, ఆట్రోఫిన్ సల్ఫేట్, ఏవిల్ ఇంజక్షన్లను ఎక్కించాలి ఈ మందు ఖరీదు రూ100 నుంచి రూ.200 వరకు ఉంటుంది. పశువులు కోలుకునే వరకు ఈ మందును ప్రతి గంటకు ఎక్కిస్తుండాలి యాంటీబయాటిక్స్, అనెల్జెసిక్స్, కార్టికోస్టిరియాడ్స్, గ్లూకోస్ వంటి మందులను అవసరాన్ని బట్టి వాడుతూ ఉండాలి శ్యాస క్రియను ఉత్తేజం చేయడానికి కొరమిన్, నికతాబైడ్ వంటి ఇంజక్షన్లు ఇస్తూ ఉండాలి ఇలా చేస్తే పాము కరిచిన పశువులను సులభంగా రక్షించుకోవచ్చు. ఈ విష సర్పాలు కరిచే అవకాశం.. అటవీ ప్రాంతంలో సాధారణంగా కట్ల పాము, తాచుపాము, రక్త పింజరలు పశువును కాటు వేస్తాయి. ఇవి ఎక్కువ విష ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పాములు సాధారణంగా పశువుల ముట్టె, కాళ్లు, పొదుగు భాగంలో కాటు వేస్తాయి. తాచుపాము, కట్ల పాము కాటువేస్తే తాచుపాము, కట్లపాము కరిస్తే న్యూటాక్సీన్ (విషం)విడుదలై పశువుల నాడీ మండలం దెబ్బతినే ప్రమాదం ఉంది.దీంతో శ్వాసకోశ వ్యవస్థ స్తంభిస్తుంది. పాము కరిచిన చోట మంట ఉండదు. కానీ నోటినుంచి నురగ వస్తుంది. శరీరం అదుపు తప్పుతుంది. పశువులు అపస్మారక స్థితిలోకి వెళ్లి సరైన కాలంలో మందులు వేయకపోతే మృతి చెందుతాయి. రక్త పింజర కరిస్తే.. రక్త పింజర కరిచినప్పుడు హిమోటాక్సిన్ (విషం) విడుదల రక్తంలో కలిసి రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో పశువుల ముక్కు, నోరు నుంచి రక్తం కారుతుంది. కాటు దగ్గర మంటగా ఉంటుంది. వాపు వచ్చి పాము కరిచినచోట చర్మం రంగు మారి రక్తం కారుతుంది. మూత్రం ఎరుపురంగులో ఉంటుంది. రక్తపింజర కాటు బారిన పశువు పది గంటల్లోగా మృతి చెందుతుంది. -
గ్లూకోజ్‌ను గ్రహించే తీరే వేరయా?
మెదడు స్పందన పిల్లలు, పెద్దల్లో భిన్నం వాషింగ్టన్: గ్లూకోజ్ ద్రవపదార్థంగా తీసుకుంటే తక్షణ శక్తి వస్తుందని ప్రకటనల్లో చూస్తుంటాం. కానీ దాని ప్రభావం పిల్లల్లో ఒకలా, పెద్దల్లో మరోలా చూపిస్తుందని అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. గ్లూకోజ్ తీసుకున్నప్పుడు పిల్లలు, పెద్దల మెదడు పనివిధానంలో తేడా ఉందని తాము చేసిన పరిశోధనల్లో రుజువైందని చెబుతున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కోలో అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సమావేశంలో ఈ పరిశోధనల వివరాలను వెల్లడించారు. మెదడులో సానుకూలప్రేరణ, నిర్ణయాత్మక శక్తిని ప్రేరేపించే భాగానికి రక్తప్రసరణ పిల్లలు గ్లూకోజ్ తీసుకున్నపుడు పెరుగుతుందని, అదే పెద్దల్లో అయితే తగ్గుతుందని వివరించారు. అయితే గ్లూకోజ్ వినియోగం వ్యక్తి ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తాము నేరుగా వెల్లడించలేమని, గ్లూకోజ్‌తో పెద్దలు, పిల్లల్లో వచ్చే స్పందనలో తేడాలను మాత్రమే కనుగొన్నామని ప్రధాన పరిశోధకుడైన మెడిసిన్, పీడియాట్రిక్స్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనియా జాస్త్రేబోఫ్ వివరించారు. తినే పదార్థాల ద్వారా షుగర్స్ వినియోగంలో పెద్దలదే పెద్ద పాత్ర అన్నారు. అయితే షుగర్స్ ఉన్న ద్రవపదార్థాల వినియోగంతో పిల్లల మెదడులో కలిగే స్పందనలను కొనగొనడంలో తమ ప్రయోగం ఒక ముందడుగు అని, ఊబకాయం పెరుగుదలకు దీనితో సంబంధం ఉందని చెప్పారు.