జంతువులను పాము కాటు నుండి ..... | protect animals from snake bite | Sakshi
Sakshi News home page

జంతువులను పాము కాటు నుండి .....

Published Tue, Nov 11 2014 1:54 AM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

protect animals from snake bite

ప్రథమ చికిత్స ఇలా..
     పాము కరిచిన చోట పైభాగాన బట్టతో గట్టిగా కట్టాలి
     కాటేసిన స్థలంలో  బ్లేడుతో కోసి  రక్తాన్ని పిండేయాలి
     {పతి 20 నిమిషాలకు కట్టును వదులుగా మళ్లీ కట్టు కట్టాలి
     పాము కరిచిన పశువుకు ఫామ్, ఆట్రోఫిన్ సల్ఫేట్,  ఏవిల్ ఇంజక్షన్లను ఎక్కించాలి
     ఈ మందు ఖరీదు రూ100 నుంచి రూ.200 వరకు ఉంటుంది.
     పశువులు కోలుకునే వరకు ఈ మందును ప్రతి గంటకు  ఎక్కిస్తుండాలి
     యాంటీబయాటిక్స్, అనెల్జెసిక్స్, కార్టికోస్టిరియాడ్స్, గ్లూకోస్ వంటి మందులను
 అవసరాన్ని బట్టి వాడుతూ ఉండాలి
     శ్యాస క్రియను ఉత్తేజం చేయడానికి కొరమిన్, నికతాబైడ్ వంటి  ఇంజక్షన్లు ఇస్తూ  ఉండాలి
     ఇలా చేస్తే పాము కరిచిన పశువులను సులభంగా  రక్షించుకోవచ్చు.

 ఈ విష సర్పాలు కరిచే అవకాశం..
 అటవీ ప్రాంతంలో సాధారణంగా కట్ల పాము, తాచుపాము, రక్త పింజరలు పశువును కాటు వేస్తాయి. ఇవి ఎక్కువ విష ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పాములు సాధారణంగా  పశువుల ముట్టె, కాళ్లు, పొదుగు భాగంలో కాటు వేస్తాయి.

 తాచుపాము, కట్ల పాము కాటువేస్తే
 తాచుపాము, కట్లపాము కరిస్తే న్యూటాక్సీన్ (విషం)విడుదలై  పశువుల నాడీ మండలం దెబ్బతినే  ప్రమాదం ఉంది.దీంతో శ్వాసకోశ వ్యవస్థ స్తంభిస్తుంది. పాము కరిచిన చోట మంట ఉండదు. కానీ నోటినుంచి నురగ వస్తుంది. శరీరం అదుపు తప్పుతుంది. పశువులు అపస్మారక స్థితిలోకి వెళ్లి సరైన కాలంలో మందులు వేయకపోతే మృతి చెందుతాయి.

 రక్త పింజర కరిస్తే..
 రక్త పింజర కరిచినప్పుడు హిమోటాక్సిన్ (విషం)  విడుదల రక్తంలో కలిసి రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో పశువుల ముక్కు, నోరు నుంచి రక్తం కారుతుంది. కాటు దగ్గర మంటగా ఉంటుంది. వాపు వచ్చి పాము కరిచినచోట చర్మం రంగు మారి రక్తం కారుతుంది. మూత్రం ఎరుపురంగులో  ఉంటుంది. రక్తపింజర కాటు బారిన పశువు పది గంటల్లోగా మృతి చెందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement